New Technology: తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలనుకుంటే.. ఇదే సరైన ఐడియా, ట్రెండ్ కూడా | బిజినెస్


Last Updated:

Business Idea: ఇల్లు కట్టాలంటే ఇటుకలు తప్పకుండా ఉపయోగించాలి. అంతే కాదు ఇటుకలకు తోడుగా సిమెంట్, కాంక్రీట్ వాటిని గోడలు కట్టడం కోసం ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. కాని మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాలజీని ఉపయోగించి ఖర్చు తక్కువతో ఇల్లు కట్టేందుకు ఇంటర్ లాక్ ఇటుకలు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి.

+

Business

Business Idea

Business Idea: ఇంటర్ లాక్ ఇటుకలతో (Interlocking Bricks) ఇల్లు కట్టడం అనేది ఇప్పుడు ఒక మంచి ట్రెండ్ అవుతోంది. సాధారణ ఇటుకలతో పోలిస్తే వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సిమెంటు వాడకం తక్కువ ఈ ఇటుకలు ఒకదానికొకటి లాక్ అయ్యేలా ఉంటాయి కాబట్టి గోడలు కట్టేటప్పుడు వరుసల మధ్య సిమెంటు మిశ్రమం వాడాల్సిన అవసరం ఉండదు. కేవలం పునాది, పిల్లర్లు పైన బీమ్స్ దగ్గర మాత్రమే సిమెంటు వాడతారు.ప్లాస్టరింగ్ అవసరం లేదు ఈ ఇటుకలు చూడటానికి చాలా ఫినిషింగ్‌తో ఉంటాయి. కాబట్టి గోడలకు ప్లాస్టరింగ్ చేయకుండానే నేరుగా పెయింట్ వేసుకోవచ్చు. దీనివల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. దీనికి సంబంధించి మేస్త్రి నాగేష్ లోకల్ 18తో మరికొన్ని వివరాలు షేర్ చేసుకున్నారు.

తక్కువ ఖర్చు..

ఇల్లు కట్టాలంటే ఇటుకలు తప్పకుండా ఉపయోగించాలి. అంతే కాదు ఇటుకలకు తోడుగా సిమెంట్, కాంక్రీట్ వాటిని గోడలు కట్టడం కోసం ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. కాని మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాలజీని ఉపయోగించి ఖర్చు తక్కువతో ఇల్లు కట్టేందుకు ఇంటర్ లాక్ ఇటుకలు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి వాసి నాగేష్ మాట్లాడుతూ ఈ ఇటుకలు ప్రస్తుతానికి చాలా గట్టిగానే ఉన్నాయని.. వర్షం, ఎండకు అన్నిటికి తట్టుకునే స్థాయిలో వీటిని తయారు చేస్తున్నట్లుగా వివరించారు. అయితే ఈ ఇంటర్లాక్ ఇటుకుల వల్ల మామూలుగా నిర్మించుకునే ఇటుకల కంటే ఈ ఇటుకులతో నిర్మాణ సమయం ఆదా మామూలు ఇటుకలతో పోలిస్తే ఈ ఇటుకలతో గోడలు చాలా వేగంగా కట్టవచ్చు. ఖర్చు తగ్గుతుంది. ప్లాస్టరింగ్ సిమెంటు ఖర్చులు తగ్గడం వల్ల మొత్తం నిర్మాణ వ్యయంలో 20% నుండి 30% వరకు ఆదా అయ్యే అవకాశం ఉందంటున్నారు.

చల్లదనం ఎక్కువ..

అంతే కాదు ఈ ఇటుకల తయారీలో వాడే పదార్థాల వల్ల ఇల్లు వేసవిలో చల్లగా ఉంటుంది. పర్యావరణ హితం వీటిని కాల్చాల్సిన అవసరం ఉండదు (High-pressure compression). కాబట్టి కాలుష్యం ఉండదు. అయితే గమనించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే నిపుణులైన మేస్త్రీలు ఈ ఇటుకలతో ఇల్లు కట్టడం కొంచెం భిన్నంగా ఉంటుంది. కాబట్టి దీనిపై అవగాహన ఉన్న మేస్త్రీలనే ఎంచుకోవాలి.నాణ్యత పరీక్ష ఇటుకలు కొనేటప్పుడు అవి సరిగ్గా లాక్ అవుతున్నాయా లేదా వాటి గట్టిదనాన్ని (Strength) సరిచూసుకోవాలి.

అపార్ట్‌మెంట్‌కి అయితే..

మీరు ఒక అంతస్తు కంటే ఎక్కువ కట్టాలనుకుంటే తప్పనిసరిగా పిల్లర్లు బీమ్స్ (Framed Structure) వేయడం సురక్షితం అంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన తాపీ మేస్త్రి నాగేష్. ఇంటర్ లాక్ ఇటుకలతో ఇల్లు కట్టాలనుకునే వారికి ఏదైనా సందేహం, నాణ్యత ప్రమాణాల గురించి తెలిసుకోవాలని అనిపిస్తే తన ఫోన్ నంబర్‌ 8008790261కి కాల్ చేసి తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *