New National Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే రెడీ | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

New National Highway: నిత్యం డేంజర్ రోడ్డుగా భావించే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు దూరంగా మ్యాపింగ్ చేసి కర్ణాటకలోని హోసకోట నుండి ప్రారంభమై చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే  తమిళనాడులోకి కలవనున్నది. ఈ జాతీయ రహదారి పనులు కళ్లు చెదిరే విధంగా డిజైన్ చేశారు.

ప్రయాణికులకు  గుడ్ న్యూస్ చెప్పిన చిత్తూరు టూ తచ్చుర్ హై వే
ప్రయాణికులకు  గుడ్ న్యూస్ చెప్పిన చిత్తూరు టూ తచ్చుర్ హై వే

New National Highway: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత ప్రజలకు కేంద్రం మంచి వార్త చెప్పింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు టూ చిత్తూరు జాతీయ రహదారిపై ప్రయాణం సాగించాలంటే ఓ పెద్ద శ్రమ అనే చెప్పాలి. ఎందుకంటే ఓ ఒక పక్క ప్రమాదాల భయం, మరోవైపు మలుపులు వద్ద భయపడుతూ వాహనాలు డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఆదమరిస్తే అంతే సంగతులు. నిత్యం ప్రమాదాలకు నెలవుగా మారిన ఈ మార్గంలో పూర్తి స్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్టు వేయాలని సంబంధిత శాఖలు అనేక మార్గాల్లో నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్, జాగ్రత్తలు వహించినప్పటికి యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదపు అంచుల నడుమ వాహనదారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జర్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఆ దారిలో ప్రమాదాలకు చెక్..

నిత్యం డేంజర్ రోడ్డుగా భావించే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు దూరంగా మ్యాపింగ్ చేసి కర్ణాటకలోని హోసకోట నుండి ప్రారంభమై చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే  తమిళనాడులోకి కలవనున్నది. ఈ జాతీయ రహదారి పనులు కళ్లు చెదిరే విధంగా డిజైన్ చేశారు. హై వే వేయడానికి వీలు లేని ప్రదేశంలో వంతెనలు ఏర్పాటు చేశారు. వీటి డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక చుట్టు పక్కల అటవీ ప్రాంతం నుండి రహదారిపైకి వచ్చే జంతువుల ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ జంతువుల కోసం అండర్ బ్రిడ్జ్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ హై వేలో వాహనాల రాకపోకలకు గతంలో పనులు పూర్తి కాక ముందు ఆంక్షలు ఉండేవి. పూర్తి దశకు చేరుకున్న తరువాత ట్రయల్ రన్ చేశారు. అద్భుతంగా ఆకట్టుకోవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైవేపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చిత్తూరు మార్గంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు చిత్తూరు తచ్చూరు హైవేపై వాహనాలను బుధవారం నుంచి ట్రయిల్ రన్‌లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్లు రోడ్డు పనులు పూర్తయ్యాయి. మొత్తం 116 కి.మీ కాగా అందులో పనులు పూర్తవ్వడంతో అధికారులు రాకపోకలకు అవకాశం కల్పించారు. త్వరలో టోల్‌గేట్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు పై 100 స్పీడ్‌తో 95 కిలోమీటర్ల దూరం 1.30 గంటల్లో చేరుకోవచ్చని అంచనా వేశారు. ఇందులో అనుపల్లె, అరతల, నరసింహరాజపురం, పల్లెపట్లు, నగరి, ఊత్తుకోట, కుమారజపేట, ఎన్ఆరురం, వీరకావేరిరాజపురం, పొంద వక్కం మొత్తం 7 ఇంటర్ చేంజ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *