National News Updates: బీహార్‌కి గుడ్‌పై.. నీతీశ్ కుమార్ ఆసక్తికర ట్వీట్.. ఇక రాజ్యసభకు..! |


బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన అధికారిక X ఖాతా నుంచి ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. దీర్ఘకాలంగా (20+ సంవత్సరాలుగా) ప్రజలు తనపై చూపిన విశ్వాసం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. బిహార్ అభివృద్ధి, గౌరవం కోసం సేవ చేశానని, ప్రజల బలంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. పార్లమెంటరీ జీవితం మొదలైనప్పటి నుంచి బిహార్ రెండు సభలతో పాటు.. పార్లమెంట్ రెండు సభల సభ్యత్వం కలిగి ఉండాలనే ఆకాంక్ష తనకు ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఈసారి రాజ్యసభ సభ్యత్వం పొందాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలతో సంబంధం కొనసాగుతుందనీ, వికసిత బీహార్ నిర్మాణానికి సంకల్పం మారదని హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారం, మార్గదర్శనం అందిస్తానని తెలిపారు. ఈ పోస్ట్ ఆధారంగా నితీశ్ కుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారని అర్థమవుతోంది.

ఇవాళ ఏమున్నాయి?

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి కాలినడకన తిరుమలకు అలిపిరి మెట్ల మార్గంలో బయలుదేరతారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నేడు భారత్‌లో ప్రధాని మోదీతో ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ భేటీ ఉంది. నేడు నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. నేడు తెలంగాణలో ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైనల్ విచారణ జరుపుతారు. నేడు AP, తెలంగాణలో టెన్త్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల అవుతాయి. తిరుపతి జిల్లా.. రైల్వే కోడూరులోని సాయినగర్‌లో ఉన్న శ్రీ సాయి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఇవాళ జాబ్‌మేళా ఉంది. ఇవాళ Elfin Agro India SME ఐపీఓ ప్రారంభమవుతుంది. T20 వరల్డ్ కప్ సెమీస్‌లో నేడు భారత్ – ఇంగ్లండ్ మ్యాచ్ ఉంది. గెలిస్తే భారత్ ఫైనల్ లోకి వెళ్తుంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *