National News Updates: ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మార్చిలో షెడ్యూల్ |


పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోంది. ఇందుకు ఎలక్షన్ అధికారులు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు మే, జూన్‌ నెలల్లో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ పోలింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారులు పర్యటించి, అన్ని వివరాలూ చెక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్ని 8 దశల్లో నిర్వహించారు. అప్పట్లో బీజేపీకి అనుకూలంగా ఉండాలనే, అన్ని దశల్లో నిర్వహించారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. కానీ తృణమూలే గెలిచింది. అసోంలో రెండు దశల్లో ఎన్నికలు జరగ్గా.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో నిర్వహించారు. ఈసారి ఎలా నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఏపీ, తెలంగాణలో నేటి నుంచి రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. నేటి నుంచి వివాహ ముహూర్తాలు మొదలవుతున్నాయి. ఢిల్లీ ఏఐ సదస్సులో నేడు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. నేడు విశాఖలో మిలాన్ 2026ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. నేడు ఢిల్లీలో తెలంగాణ నేతలతో ఏఐసీసీ సమావేశం ఉంటుంది. తెలంగాణ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరుపుతారు. 19-21 మధ్య సంగారెడ్డిలో IIT హైదరాబాద్.. SMSE టెక్ కనెక్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నేడు వోక్స్‌వ్యాగన్ Tayron R-Line కారు లాంచ్ అవుతుంది. T20 వరల్డ్ కప్‌లో నేడు వెస్టిండీస్Xఇటలీ, శ్రీలంకxజింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్xకెనడా మ్యాచ్‌లు ఉన్నాయి. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *