జనసేన సంగతేంటి? అభ్యంతరాలు రావా?: ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం లోకేష్ ప్రస్తుతం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాత్రమే. అంతేగానీ ఆయనే అన్నీ కాదు. మరోలా చెప్పాలంటే.. సీఎం తర్వాత రెండో స్థానంలో ఉన్నది డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్. మామూలుగా అయితే డీసీఎం పదవికి అంతగా గుర్తింపు ఉండదు. అది అసలు రాజ్యాంగ పదవే కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో ఉండటం వల్ల దానికి చాలా గుర్తింపు వచ్చింది. ఈ రోజున టీడీపీ భారీ మెజార్టీతో అధికారంలో ఉందంటే.. దానికి జనసేన జట్టు కట్టడం అసలైన కారణం. జనసేన కలిసి ఉండకపోతే.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీ, జనసేన మధ్య చీలిపోయి.. మళ్లీ వైసీపీకి అధికారంలోకి వచ్చినా వచ్చేదే. 2019లో అదే జరిగింది. టీడీపీ, జనసేన కలవడం వల్లే.. భారీ మెజార్టీ వచ్చిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మరి అలాంటప్పుడు.. నెక్ట్స్ సీఎం లోకేషే అని టీడీపీలో తరచూ వ్యాఖ్యలు రావడం.. పొత్తు ధర్మానికి నెగెటివ్ సంకేతం అవ్వగలదు. కానీ.. టీడీపీకి నెక్ట్స్ ఎన్నికల్లో కూడా ఇలాగే సొంత మెజార్టీ స్థాయి సీట్లు వస్తే, అప్పుడు లోకేష్‌ని సీఎం చేసినా ఎవరూ అడ్డు చెప్పలేకపోవచ్చు. ఈ కారణంగానే.. లోకేష్ మార్క్ పార్టీలో పెరుగుతోంది.



