చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో రూ.200 నుంచి 250 మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.400కు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక నాటు- కోడి ధరలు మరింతగా పెరిగి రూ.700 నుంచి రూ.900 వరకు చేరుకోవడం గమనార్హం. #mutton #chickenprice #apnews
Source link


