Last Updated:
Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి లాగా టెంకాయ తీసుకువచ్చి పొలాల్లో ఎక్కడ బోర్ పాయింట్ ఉంటుందో చూస్తారు. లేకపోతే జియాలజిస్టును తీసుకొని వచ్చి కంప్యూటర్ ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడున్నాయి గుర్తిస్తారు.
Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి లాగా టెంకాయ తీసుకువచ్చి పొలాల్లో ఎక్కడ బోర్ పాయింట్ ఉంటుందో చూస్తారు. లేకపోతే జియాలజిస్టును తీసుకొని వచ్చి కంప్యూటర్ ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడున్నాయి గుర్తిస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు అలా కాదు పంట పొలాల్లో బోరు పాయింట్ పెట్టాలంటే ఇది ఒక కొత్త రకం టెక్నాలజీ ఏమిటా అనుకుంటున్నారా మామూలుగా బోరు పాయింట్ వేయాలంటే టెంకాయ గాని లేక ఇంజనీర్ గాని బోరు పాయింట్ వేస్తారు. అది ఏమి కాక ఇప్పుడు ఏకంగా ఓ ఎద్దును పంట పొలాల్లో బోరు పాయింట్ గర్తు పెడుతుంది. ఎద్దు బోరు పాయింట్ పెట్టడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా.. అవును మేం చెబుతున్నది నిజమే. చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలంలోని తెట్టు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రైతు మల్లేష్ దాదాపు ఆరు బోర్లు వేసిన ఫలితం లేకపోయింది. అప్పుడే కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగుళూరుకు చెందిన ఎద్దు శరణ్యను ఇన్స్‌స్టాగ్రామ్ లో చూసి ఎలాగైనా ఆ ఎద్దును తన పొలంలో తీసుకుని వచ్చి బోరు వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అక్కడికి చేరుకొని వాళ్లతో చెప్పి ఆ ఎద్దును ఆంధ్ర రాష్ట్రలోని వి.కోటకి తీసుకొచ్చాడు. తీసుకు వచ్చిన తర్వాత ఆ ఎద్దు చేస్తున్న విన్యాసాలు చూసి ఆశ్చర్యపడ్డారు. అది ఏమిటంటే ఆ ఎద్దు బోరు పాయింట్ వేయాలంటే పొలం అంతా తిరిగి ఎక్కడ బోరు పాయింట్ ఉంటుందో అక్కడ గంజరం (మూత్ర విసర్జన) పోసిందంటే అక్కడ ఖచ్చితంగా నీళ్లు పడుతుందని వాళ్ళ నమ్మకం. రైతు ఎద్దు కాళ్లు మొక్కి నీళ్లు రావాలి అని చెబితే అతని పొలంలో నీళ్లు ,ఉంటే ఆ ఎద్దు కాళ్ళు ఎత్తి అతనిని ఆశీర్వదిస్తుంది.
అంతే కాదు ఆ ఎద్దు ఎన్ని సార్లు అడుగులు వేస్తే అన్ని అడుగుల లోతులో నీరు ఉందని అర్థం. ఒకవేళ రైతుపై కాలు మోపలేదంటే అక్కడ నీరు లేదని అర్థం. అవును నిజమే మరొక విషయం ఏమిటంటే బోరు పాయింట్ పెట్టాక బోరు వెహికల్ వచ్చిన తర్వాత పూజ చేసి నీళ్లు వచ్చేదాకా ఆ ఎద్దు బోరు పాయింట్ వద్దే ఉంటుంది ఉంటుంది. తర్వాత నీళ్లు వచ్చిన తర్వాత ఆ రైతుని బోరు వద్ద కూర్చోబెట్టి పాతాళ గంగను తాకి ఆ రైతుకు ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది అంతా చూసి చుట్టుపక్క గ్రామస్తులు ఆశ్చర్యకరంగా వచ్చి ఆ ఎద్దును చూశారు. ఈ కాలంలో కూడా ఇలాంటి బోరు పాయింట్లు వేయడానికి ఇలాంటి ఎద్దు ఉందంటే ఆశ్చర్యకరంగా చూస్తున్న గ్రామస్తులు ఇక ఎవరైనా బోరు పాయింట్ వేయాలనుకుంటే మాకు సంప్రదించండి మేము కచ్చితంగా బోరు పాయింట్ వేస్తామని ఆ ఎద్దు యాజమాన్యం కోరారు.
కలియుగంలో ఇలాంటి జరుగుతున్నాయి అంటే ఆశ్చర్యకరంగా జరుగుతుంది. ఏది అయినప్పటికీ బోరు పాయింట్ వేస్తున్న ఎద్దును చూడడానికి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుంచి భారీగా అతనికి ఫోన్లు సంభాషణలు చేస్తున్నారని ఆ యాజమాన్యం అన్నారు.
Chittoor,Chittoor,Andhra Pradesh


