Maoists Surrender: సీఎం రేవంత్ ముందు తుపాకులతో సహా లొంగిపోయిన మావోయిస్టులు.. వీరికి పూర్తి భరోసా ఇచ్చిన ప్రభుత్వం | తెలంగాణ వార్తలు


Last Updated:

Maoists Surrender: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.

cm revanth reddy
cm revanth reddy

Maoists Surrender: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వారు సరెండర్ చేసిన ఆయుధాల్లో ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులు ఉన్నాయి. వీటన్నింటితో పోలీసులకు మావోయిస్టులు లొంగిపోయారు.

వీరిని సీఎం రేవంత్ రెడ్డి జనజీవన స్రవంతిలోకి ఆహ్వానం పలికారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తామిచ్చిన పిలుపును గౌరవించి లొంగిపోయిన మావోయిస్టులకు స్వాగతం, ధన్యవాదాలను సీఎం చెప్పారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని హామీ ఇచ్చారు. ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపును ఇచ్చారు. శాంతి మార్గంలోనే మహాత్మ గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పారు.

మావోయిస్టులకు భరోసా: 

వీరికి ప్రభుత్వం పునరావాస పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జనజీ:వన స్రవంతిలో చేరాలనే ఆకాంక్షే ఇందుకు కారణమని సమాచారం. ఈ లొంగుబాటు ప్రక్రియ ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే పునరావాస ప్యాకేజీలను వివరిస్తున్నారు. ఒకేసారి 124 మంది మావోయిస్టులు ఇలా సరెండర్ అవ్వడం రాష్ట్ర పోలీసు చరిత్రలోనే ఒక రికార్డు అని అధికారులు వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *