ఏపీ తీర ప్రాంతాల్లో హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్: కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన యానాం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వేడి, తేమ వాతావరణం కొనసాగుతుంది. ఇబ్బందికరమైన ఉక్కపోత ఉంటుంది.. మాక్స్ టెంపరేచర్ 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండటం వల్ల చెమట పట్టి ఇబ్బంది పడవచ్చు. రాయలసీమలో కూడా డ్రై వెదర్, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఇంతకు ముందు అక్కడక్కడా ఉరుములతో వర్షాలు పడినా.. ఏప్రిల్ 10 నుంచి పొడి వాతావరణమే ఉంటుంది అని IMD అమరావతి డిస్ట్రిక్ట్ వాతావరణ శాఖ తెలిపింది.



