Last Updated:
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, పంచారామ క్షేత్రాలు, పిఠాపురం, గోదావరి సముద్రతీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక పూజలు, పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి.
ఏపీలో మహాశివరాత్రి సందర్భంగా ఒకపక్క కోటప్పకొండ, మరో మరోపక్క పంచారామ క్షేత్రాలతో పాటు సైవక్షేత్రాలు సైతం భక్త జనులతో కిటకిటలాడుతున్నాయి. పరమపావనమైన స్వామివార్ల కోనేరులు, సముద్రతీర ప్రాంతాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, హరహర మహాదేవ అంటూ స్వామిని దర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా గుంటూరు నరసరావుపేట కోటప్పకొండకు భక్తుల సంఖ్య అత్యధికంగా పెరుగుతూ వచ్చింది, మరోపక్క ఏపీలో పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, దివ్యక్షేత్రాలలో ఎటుచూసినా భక్తజనులు అత్యధికంగా చేరుకున్నారు. మరోపక్క గోదావరి జిల్లాలో గల సముద్రతీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఒకసారి అప్‌డేట్ చూద్దాం..
ముక్తికి మార్గాన్ని ఇచ్చే మహాశివరాత్రి సందర్భంగా ఏపీలో ఉన్న ప్రధాన స్వయంభూ దివ్యక్షేత్రలతో పాటు, ప్రతి ప్రాంతంలో ఉన్న శివాలయం భక్తుల పూజలతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు నరసరావుపేటలో ఉన్న కోటప్పకొండ దివ్య క్షేత్రానికి భక్తుల సంఖ్య అత్యధికంగా ఈ ఏడాది పెరిగిందని చెప్పుకోవచ్చు. ముందే భక్తుల సంఖ్య ఊహించిన జిల్లా కలెక్టర్, పోలీసులు, పెద్దఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రద్దీ కొనసాగుతుంది. ముందుగా కోటప్పకొండ దేవస్థానం అర్చకులు మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్ధరాత్రి భక్తులకు దర్శనం కల్పించారు. దీంతో మహాదేవ శంభోశంకర అంటూ కోటప్పకొండ లో గల ఈశ్వరుని భక్తులు దర్శించుకుంటున్నారు.
మరోపక్క పంచారామ దివ్యక్షేత్రాలు అయిన అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, ప్రాంతాలలో గల పరమ పావనమైన మహాదేవుని కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దేవతలు ప్రతిష్టించిన స్వామివారి లింగానికి అభిషేకం చేసి ఆపై స్వామివారి సన్నిధానంలో ఆధ్యాత్మికంగా భక్తులు కుటుంబాల సమేతంగా గడుపుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దివ్యసన్నిధి ఆచారం ప్రకారం పెద్దల పేర్లుపై దానాలు ఇవ్వడం, ఒక సంస్కృతిగా చెప్పుకోవచ్చు, దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి పిఠాపురం చేరుకుని స్వామిని దర్శించుకుని పెద్దల పేర్లుపై దానాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా సముద్రస్నానం ఆచరించడం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది అని పురాన ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ నేపద్యంలో గోదావరి జిల్లాలో గల కాకినాడ, ఉప్పాడ, అద్దరిపేట, పెరమళ్ళపురం, కోనసీమ జిల్లాలోగల రాజోలు, అంతర్వేది, సఖినేటిపల్లి, ఇలా దాదాపు అన్ని సముద్ర తీరప్రాంతాలు భక్తులతో కలకలలాడుతూ కనిపిస్తున్నాయి, ఒక జాతర మాదిరిగా తీరప్రాంతాలకు చేరుకుని కుటుంబాల సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించి, ఆ ఒడ్డున గల దైవతామూర్తుల సన్నిధిలో పూజలు నిర్వహించి భక్తులు ఆనందంగా గడుపుతున్నారు.
ఈ ఏడాది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో 24 గంటల ఏకధాటిగా సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు, మహా శివరాత్రి ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సంకీర్తనలు, మరుసటి రోజు 6 గంటల వరుకు కొనసాగుతాయని భక్తులు తెలిపారు, అనేక భజన బృందాలు ప్రతి గ్రామంలో శివనామ స్మరణ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Feb 15, 2026 11:33 AM IST


