Last Updated:
Madanapalle Child Murder Case Update:మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Madanapalle Child Murder Case Update: మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కురబలకోట మండలం కనసానివారి పల్లె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదివేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఆడుకుంటున్న 7 ఏళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అమాంతం అత్యంత ఘోరంగా నీటి డ్రమ్ములో ముంచి నిందితుడు హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పుడు ఇలా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు, పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంటూ ఆడుకుంటుంది. పనికి వెళ్లిన ఆమె తల్లి సాయంత్రం 4 గంటలకు ఇంటికి ఫోన్ చేసింది. తన తండ్రిని పాప గురించి అడగ్గా ఇంట్లో లేదని చెప్పాడు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్లిందేమో అని మొదటి భావించగా, ఎంతసేపటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతకడానికి వెళ్లారు. ఫలితంగా లేకపోవడంతో చిన్నారి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా, స్థానికంగా వాట్సప్ గ్రూపుల్లో బాలిక ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోస్టులు పెట్టారు.
బాలిక ఎదురింట్లో ఉండే కులవర్ధన్(30)కు నేర చరిత్ర ఉందని తెలిసింది. దీంతో రాత్రి 1.30 గంటలకు పోలీసులు అతడి ఇంట్లో గాలించడానికి చేరుకున్నారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుళ్లు కిటికీలోంచి చూడగా కులవర్ధన్ పడుకుని ఉన్నాడు. అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. బాలిక చివరిసారిగా కులవర్ధన్‌తో కనిపించిందని ఆమె తాత చెప్పారు. దీంతో మంగళవారం ఉదయం 7 గంటలకు మళ్లీ అతడి ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూశారు. అప్పుడు చిన్నారి డ్రమ్ములో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. అత్యాచారం చేసి తర్వాత నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. రాత్రంతా మృతదేహం నీటిలో ఉంది. అలానే ఉంచి అదే గదిలో నిద్రపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీంచగా ఇప్పుడు ఇలా చిన్నారి మృతదేహం లభ్యమైంది. అయితే నిందితుడు గంజాయికి అలవాటు పడినట్లు తేల్చారు. నిందితుడుపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇలా నిందితుడు చెరువులో దూకి మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



