Lunar Eclipse: గాలిలో నిలబడ్డ రోకలి బండ.. గ్రహణం రోజు ఇలాగే జరుగుతుందట..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి కాలంలో ఎలాంటి పనులు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేవారో, నేటి కాలంలో సైతం అలాంటి పనులే చేస్తున్నారు.

+

గ్రహణకాలంలో

గ్రహణకాలంలో రోకలి ఇలా నిలబడిందో చూడండి

Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి కాలంలో ఎలాంటి పనులు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేవారో, నేటి కాలంలో సైతం అలాంటి పనులే చేస్తున్నారు. అయితే అదిచూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. వింత జాతర్లు కావచ్చు వింత పూజలు కావచ్చు అదేవిధంగా గ్రహణ కార్యక్రమాలు కావచ్చు,ఏదేమైనా ఆజిల్లాలకు సాటిలేదు అనేవిధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తాజాగా గ్రహణం సందర్భంగా ఒకకార్యక్రమానికి ఆ జిల్లావాసులు శ్రీకారం చుట్టారు. అదిచూసిన అందరూ ఆశ్చర్యపడుతూ తిలకించారు ఇంతకీ ఏం చేసారు. ఆ జిల్లా ఎక్కడుంది? ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

గ్రహణం రోజు ఇలాగే జరుగుతుందట..

ప్రశాంతతకు మారుపేరైన గోదావరిజిల్లాలో వింత ఆచారాలు వింత పూజలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయని చెప్పుకోవచ్చు. నిజానికి అది గొప్ప నమ్మకంగా కూడా చెప్పబడుతుంది, దైవతమూర్తుల జాతరలు గోదావరి జిల్లాలో చూస్తే అద్భుతం అనక మానరు, అయితే నాటి కాలంలో ఏ సంస్కృతి అయితే ప్రారంభించారో అదే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది.  తాజాగా గ్రహణ కాలం సందర్భంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కిర్లంపూడి మండలం రమణయ్యపేటలో మహిళలు అసలు గ్రహణం అంటే ఏంటి? గ్రహణాన్ని మనం ఎలా గుర్తించాలి అన్నవిషయాన్ని గ్రామ పెద్దలు మహిళలు ప్రత్యేకంగా వివరించారు లైవ్లో వీడియో ద్వారా చూపించారు.

నిలబడ్డ రోకలి బండ..

నిజానికి గ్రహణం ఉంది అని గుర్తించాలి అంటే ఆరుబయట ఇత్తడి పళ్లెం పెట్టి, ఆపళ్లెంలో నీళ్లుపోసి ఆపై పసుపు కుంకుమ పువ్వులు వేసి మధ్యలో రోకలి నిలబెడుతూ ఉంటారు. అది గ్రహణ కాలమైతే కచ్చితంగా ఆ రోకలి నిలబడుతుందని రమణయ్యపేట వాసులు తెలిపారు. తాజాగా గ్రహణం సందర్భంగా ఆ రోకలి అదేవిధంగా నిలబడి ఉంది తిరిగి మరల గ్రహణకాలం ముగిసిన తర్వాత ఆ రోకలి దానంతట అదే పక్కకి పడిపోతుందని స్థానికులు తెలియజేశారు. అయితే టెక్నాలజీ రోజుల్లో ముందస్తుగా ఈ గ్రహణ కాలం గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నప్పటికీ, నాటి కాలంలో ఏవిధంగా పెద్దలు రోకలి ఇతడి గిన్నెలో నిలబెట్టే వారో ఇప్పుడు కూడా అదే విధంగా నిలబెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ముఖ్యంగా సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తుల సమతుల్యత కారణంగా జరిగే ప్రక్రియ ప్రజలు నమ్ముతారు, ముఖ్యంగా గ్రహణం సమయంలో భూమి ఆకర్షణ శక్తి పై ఇతర శక్తులు ప్రభావం వల్ల సాధారణ సమయంలో పడిపోయే రోకలి ఈ సమయంలో కచ్చితంగా ఇత్తడిపల్లెంలో నిలబడుతుందని మరొకసారి నిరూపించారు రమణయ్యపేట మహిళలు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *