ప్రియుడు నాగరాజును వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, తమను విరుద్ధంగా వెళ్లిన కూతుర్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో చౌడేశ్వరిని ఇంటికి రప్పించడంలో సీఐ వెంకట రమణ సహకరించినట్లు తేలింది. ఇందుకోసం అతను వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు కూడా విచారణలో బయటపడింది.
హత్యను మొదట ఆత్మహత్యగా చూపించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ సమయంలో సీఐ అందుబాటులో లేకపోవడంతో ఆ యత్నం విఫలమైంది. అనంతరం పోస్ట్‌మార్టం నివేదికలో ఇది ఆత్మహత్య కాదని స్పష్టమవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సీఐపై వచ్చిన ఆరోపణలను పరిశీలించిన ఉన్నతాధికారులు అతని ప్రమేయం నిర్ధారించడంతో వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.
36 గంటల తర్వాత లభ్యమైన అమెరికా ఫైలట్ ఆచూకీ:
రెస్క్యూ ఆపరేషన్ ముందుు భారీ ఫైర్ ఫైట్. 36 గంటల తర్వాత లభ్యమైన అమెరికా ఫైలట్ ఆచూకీ. గల్లంతైన అమెరికా ఫైలట్ ఆచూకీ లభ్యమైంది. ఫైలట్‌ను రక్షించిన అమెరికా రక్షణ దళాలు.
అదుపు తప్పి లోయలో పడిన పర్యాటకులతో వెళ్తున్న వాహనం.. నలుగురు మృతి:
పర్యాటకులతో వెళ్తున్న వాహనం అర్ధరాత్రి అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో శనివారం రాత్రి దాటిన తర్వాత జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉండగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బంజార్ సబ్ డివిజన్ పరిధిలోని ఘియాగి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకులు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ నియంత్రణ తప్పి రహదారి పక్కనే ఉన్న లోతైన లోయలోకి దూసుకెళ్లినట్లు గుర్తించారు.
మన్యం ప్రాంతంలో రాత్రి స్వల్ప భూకంపం:
ఏపీలోని మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి స్వల్ప భూకంపం కలకలం సృష్టించింది. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా అనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి మేల్కొని, ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరకు–పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలో ఉండటంతో ఇలాంటి ప్రకంపనలు అప్పుడప్పుడు సహజమేనని నిపుణులు చెబుతున్నా, ఈసారి వచ్చిన అనుభవం ఇంతవరకు ఎప్పుడూ ఎదురుకాలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో దంచికొట్టిన భారీ వర్షం:
తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నార్త్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉండగా రానున్న మరో గంటలో మేడ్చల్, యాదాద్రి, ఘట్ కేసర్, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


