Last Updated:
Konaseema Political Tensions:ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో పోలీసులు బూట్ల శబ్ధం, వందల సంఖ్యలో వీధుల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసుల యాక్షన్ ప్లాన్ అందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్నపళంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెల రోజులు పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్వయంగా డిఎస్పి సుంకర మురళీమోహన్ ప్రకటించారు.
Konaseema Tensions: ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో పోలీసులు బూట్ల శబ్ధం, వందల సంఖ్యలో వీధుల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసుల యాక్షన్ ప్లాన్ అందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్నపళంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెల రోజులు పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్వయంగా డిఎస్పి సుంకర మురళీమోహన్ ప్రకటించారు. ఇలాంటి వాతావరణంలో సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సమావేశాలకు పర్మిషన్ లేదని.. ఎవరైనా యాక్ట్‌ని ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పి మురళీమోహన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా పని లేని వాళ్లు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్లే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందని అందుకే 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు.
ఎవరో పెడుతున్న సోషల్ మీడియా పోస్టులతో ఇప్పుడు జిల్లాలోని రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా తయారైంది. ఒక పార్టీ వర్గపోరు స్వల్ప వివాదాల నేపథ్యంలో కేసనపల్లి లక్కవరం గ్రామాల్లో డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున కవాతు కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ప్రత్యేకంగా మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ఈ విషయాన్ని అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట పోలీస్ డివిజన్ వ్యాప్తంగా 30 రోజులపాటు 30 పోలీస్ యాక్ట్ అమలపరుస్తున్నట్లు డివిజన్ డిఎస్పి సుంకర మురళీమోహన్ స్పష్టం చేశారు.
ఈ 30రోజులు ప్రజలు బహిరంగ కార్యక్రమాలు ధర్నాలు అందరూ ఒక దగ్గరికి చేరి కార్యక్రమాలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిఎస్పి స్వయంగా హెచ్చరించారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో రాజకీయం కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను పోస్టులు చేస్తే వారిపై ప్రత్యేక కేసులు చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరం రీత్యా కార్యక్రమాలు నిర్వహించాలంటే కచ్చితంగా పోలీసులు అనుమతి తీసుకోవాలని సూచించారు.
మల్కిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఒకపార్టీ వర్గపోరు సమస్యల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు, సంబంధం లేనివారు దూరి సమస్యలు కొని తెచ్చుకోవద్దంటూ డిఎస్పీ హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పోలీసు బలగాలతో కేసనపల్లి లక్కవరం తదితర గ్రామాల్లో పోలీస్ కవాతు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక మైకుల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని పోలీసులు వివరించారు..
దయచేసి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా సహకరించాలని ముఖ్యంగా అందరూ కలిసి చేసే కార్యక్రమాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని డిఎస్పి సూచించారు, అత్యవసరమైతే పోలీసులకు విషయం తెలియజేస్తే తదుపరి పోలీసులు విషయాన్ని ప్రకటిస్తారన్నారు. నిజానికి కొన్ని పరిస్థితుల్లో సంబంధం లేని వ్యక్తులు కలగజేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని డిఎస్పి అన్నారు.
ఒక పార్టీ ఒక సమస్య వస్తే శాంతియుతంగా పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్లాలని అలా కాకుండా సంబంధం లేని వ్యక్తులు రంగ ప్రవేశం చేసి ఇబ్బందులు పాలవుతున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో కేసనాపల్లి లక్కవరం తదితర గ్రామాల్లో యువత సైతం వారి పనిలో చక్కబెట్టుకుంటూ ఉద్యోగ వ్యాపారాల్లో ఉండాలి తప్ప, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


