Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకించిన బండారు.. ఇలా వాడితే పీడలు, దోషాలు మాయం |


Last Updated:

Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకం చేసిన బండారు కోసం బెంగళూరు హైదరాబాద్ కర్నూలు నగరాల నుండి భక్తులు అధికంగా వస్తున్నారు. కాలభైరవ స్వామి బండారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని లోకల్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది.

+

అభిషేకించె

అభిషేకించె కాల భైరవ స్వామి బండారు అన్నింటికీ ఇదే…

Kalabhairava Swamy Temple: శ్రీ సత్య సాయి పట్టపర్తి జిల్లా ముత్యాల చెరువు దగ్గర ఉన్న గట్ల ప్రాంతంలో కాలభ కాలభైరవ స్వామి ఆలయం ప్రజలకు ఎంతో ఆకర్షణ నిలుస్తోంది.శివుని ఉగ్ర రూపాలలో ఒకరైన కాలభైరవ స్వామి హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దైవంగా పూజలందుకుంటారు. ఆయనను “కాశీ క్షేత్ర పాలకుడు” అని, “కాలానికి అధిపతి” అని పిలుస్తారు. అయితే శ్రీ సత్యసాయి జిల్లా గట్లు ప్రాంతంలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయం ప్రత్యేకంగా నిలుస్తుంది. కాలభైరవ స్వామికి అభిషేకం చేసిన బండారు కోసం బెంగళూరు హైదరాబాదు కర్నూలు నగరాల నుండి భక్తులు అధికంగా వస్తున్నారు కాలభైరవ స్వామి బండారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని లోకల్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది.

బండారుని నీళ్లలో కలుపుకొని తాగి..

ఆలయానికి వచ్చేవాళ్ళు అధికంగా చిన్నపిల్లలకు దోషాలు పీడకలలు లాంటి వచ్చినప్పుడు స్వామిని మొక్కుకొని బండారును నీళ్లలో కలుపుకొని తాగితే నయమవుతుందని భక్తులు ప్రధానంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా పంట పొలాలు సరిగా పండకపోయినా ఇక్కడ ఉన్న స్వామివారి దగ్గర నుంచి బండారు తీసి వెళ్లి పంట పొలాలకు చల్లితే పంట అధికంగా పండుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అలాగే ఇంటి చుట్టు పరిసర ప్రాంతాల్లో పాములు తేళ్లు లాంటివి కీటకాలు వచ్చినప్పుడు స్వామి బండారు చుట్టుపక్కల ఇంటి పరిసర ప్రాంతాల్లో చల్లితే పాములు రావని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి శ్రీరాములు లోకల్ 18 తో తెలిపారు.

కాలానికి అధిపతి.. 

“కాల” అంటే సమయం, “భైరవ” అంటే భయంకరమైనవాడు. మన జీవితంలో గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకురాలేము, కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రూపం మనకు బోధిస్తుంది. కాలభైరవుడిని పూజిస్తే కాల దోషాలు, సమయం కలిసిరాకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. కాశీ క్షేత్ర పాలకుడు కాశీ (వారణాసి) నగరానికి కాలభైరవుడే కొత్వాల్ (రక్షక భటుడు). కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నాక, కాలభైరవుడిని దర్శించుకుంటేనే యాత్ర ఫలం దక్కుతుందని చెబుతారు. కాశీలో నివసించే వారి పాపపుణ్యాల లెక్కలను ఆయనే చూసుకుంటారు.

శనిదోషాలు మాయం..

కాలభైరవ స్వామి వాహనం నలుపు రంగు శునకం. అందుకే భైరవ ఆరాధన చేసేవారు కుక్కలకు ఆహారం పెట్టడం విశేషంగా భావిస్తారు. ఇది ప్రాణి కోటి పట్ల కరుణను కలిగి ఉండాలని సూచిస్తుంది. శని దోష నివారణ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడికి గురువు కాలభైరవుడు. అందుకే శని దోషాలు, ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు. కాలభైరవ అష్టకాన్ని పఠించడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.భయం శత్రు వినాశనం అకాల మరణ భయం ఉన్నవారు, శత్రువుల బాధలతో ఇబ్బంది పడేవారు స్వామిని శరణు వేడుకుంటారు. రక్షణ కవచంగా చాలామంది కాలభైరవుడి ప్రసాదమైన నలుపు దారాన్ని మొలతాడుగా లేదా చేతికి కట్టుకుంటారు. దీనివల్ల దిష్టి, నరఘోష తగలవు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *