Kadiri Theru Festival: లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం.. కదిరి తేరు చూడాల్సిందే | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తెరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది ఒకటి.

+

kadiri

kadiri akshmi narasimha swamy

Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తేరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది ఒకటి. రాష్ట్రంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా పేరుగాంచింది. సుమారు 120 టన్నుల బరువు, భారీ చక్రాలతో చూడటానికి చాలా భీకరంగా, అద్భుతంగా ఉంటుంది.

కదిరి తెరు ఉత్సవం..

భక్తజన సందోహం ఈ రథోత్సవానికి కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ తమిళనాడు నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. “గోవింద నామస్మరణ”తో కదిరి పట్టణం మారుమోగిపోతుంది. అయితే ఈ త రథం కదలడానికి కుటాగులల ప్రాంతం నుండి బోయలు వాల్మీకి సామాజిక వర్గం వారు వస్తేనే ఈ తెరు కదులుతుంది అనే నానుడి ఎన్నో సంవత్సరాలుగా ఉంది.

భారీ రథం..

ధర్మవరం ప్రాంతానికి చెందిన వీరనాయుడు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కదిరి పక్కనున్నటువంటి కుటాకుల ప్రాంతం నుండి బోయ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకులు వచ్చి తీరుని కలిపితేనే తీరు కదులుతుంది అనే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ సంప్రదాయాన్ని మా పూర్వీకులు పాటించారు అదే సంప్రదాయాన్ని మేము కూడా భక్తిశ్రద్ధలతో పాటిస్తూనే ఉన్నాం. కార్తీక లక్ష్మీనరసింహస్వామి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.

పండ్లు, ధాన్యాలను విసిరే భక్తులు..

అయితే చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే భక్తుల కోసం స్థానికంగా ఉండే వ్యాపారస్తులు పట్టణవాసులు భక్తుల సౌకర్యార్థం భోజనాలు నీళ్ల వసతి ఎటు చూసినా కల్పిస్తుంటారు. అయితే లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో భాగంగా ఎటుచూసినా భక్తులు దర్శనమిస్తున్నారు. వినూత్నమైన ఆచారం (పండ్లు విసరడం) కదిరి తెరు ప్రత్యేకత ఏమిటంటే, రథం సాగుతున్నప్పుడు భక్తులు తమ కోరికలు నెరవేరాలని లేదా మొక్కుల రూపంలో దక్షాది పండ్లను (ముఖ్యంగా ద్రాక్ష, అరటి పండ్లు, దవనం మిరియాలు) రథంపైకి విసురుతారు. రథం పైనున్న స్వామివారికి ఇవి తగిలితే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత స్వామివారు హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత ఇక్కడ వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. వసంతోత్సవాల సమయంలో జరిగే ఈ రథోత్సవం పది రోజుల ఉత్సవాలలో హైలైట్‌గా నిలుస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *