Last Updated:
Jowar Idli Recipe: ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ మన సంప్రదాయ ధాన్యాలైన మిల్లెట్స్ మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. అందులో ముఖ్యంగా జొన్నలు (Sorghum) శరీరానికి అవసరమైన పోషకాలు అందించే శక్తివంతమైన ధాన్యం.
Jowar Idli Recipe: ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ మన సంప్రదాయ ధాన్యాలైన మిల్లెట్స్ మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. అందులో ముఖ్యంగా జొన్నలు (Sorghum) శరీరానికి అవసరమైన పోషకాలు అందించే శక్తివంతమైన ధాన్యం. బియ్యంతో చేసే సాధారణ ఇడ్లీలకు బదులుగా జొన్నలతో చేసే ఇడ్లీ మరింత ఆరోగ్యకరమైనది, తేలికగా జీర్ణమయ్యేది. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలని కోరుకునేవారికి, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారికి ఇది ఉత్తమమైన అల్పాహారంగా చెప్పవచ్చు. సంప్రదాయ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జొన్న ఇడ్లీని ఇంట్లో సులభంగా తయారు చేసుకోనే విధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినప గుళ్ళురెండు కప్పులు జొన్నలు (శుభ్రపరచినవి)ఒక టీస్పూన్ సగ్గుబియ్యం తగినంత ఉప్పుఅవసరమైనంత నీరు
తయారీ విధానం – స్టెప్ బై స్టెప్
స్టెప్ 1: నానబెట్టడంమొదట మినప గుళ్ళను మరియు జొన్నలను వేర్వేరుగా 2–3 సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో మినప గుళ్ళు, మరో గిన్నెలో జొన్నలు వేసి 6–8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. సగ్గుబియ్యం మినప గుళ్ళతో కలిపి నానబెట్టవచ్చు. జొన్నలు మరియు మినపగులను కలిపి కూడా నానబెట్టుకొని రుబ్బుకోవచ్చు.
స్టెప్ 2: రుబ్బడంముందుగా నానబెట్టిన మినప గుళ్ళ జొన్నలు నానబెట్టిన నీళ్లలో వడపోసి వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ జార్లో రుబ్బేటప్పుడు పప్పుకు సరిపోయినంతగా నీటిని కొంచెం జోడిస్తూ మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రూబిన రుబ్బును వెడల్పాటి పాత్రలో తీసుకొని గరేటతో బాగా కలుపుకొని పాత్ర పై మూత పెట్టుకొని ఉంచుకోవాలి.
స్టెప్ 3: ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం)రుబ్బిన పిండాన్ని మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో రాత్రంతా ఉంచాలి (సుమారు 8 గంటలు). ఉదయం చూస్తే పిండం కొంచెం ఉబ్బి, గాలి బుడగలతో లేతగా కనిపిస్తుంది. ఇదే ఇడ్లీలు ప్లఫీగా రావడానికి ముఖ్య కారణం.
స్టెప్ 4: ఇడ్లీ వేయడం ఈ పులిసిన ఇడ్లీ రబ్బులోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పును జోడించి ఆ రుబ్బుని.ఇడ్లీ పాత్రలో ఒక్కొక్క గరిట చొప్పున రుబ్బిన రూబ్ని . ఇడ్లీ పాత్రలో పోయాలి.ఇడ్లీ స్టీమర్ లేదా పెద్ద గిన్నెలో నీరు మరిగించాలి. నీరు మరిగిన తర్వాత ఇడ్లీ స్టాండ్‌ను లోపల ఉంచి మూతపెట్టి 10–12 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి.ఇడ్లీ ఉడికిందో లేదో చూడాలంటే టూత్‌పిక్ పెట్టి చూడండి. అది శుభ్రంగా బయటకు వస్తే ఇడ్లీ రెడీ.
స్టెప్ 5: సర్వింగ్ఇడ్లీలు కొద్దిసేపు చల్లారిన తర్వాత స్పూన్‌తో తీసుకోవాలి. ఇవి కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా పల్లీ చట్నీతో చాలా రుచిగా ఉంటాయి.
జొన్నల ప్రయోజనాలు
అధిక ఫైబర్: జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది.రక్తంలో చక్కెర నియంత్రణ : జొన్నల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మధుమేహ రోగులకు అనుకూలం. గ్లూటెన్ రహితం – గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి జొన్నలు మంచి ప్రత్యామ్నాయం.ప్రోటీన్ మరియు ఐరన్ సమృద్ధిగా – శరీరానికి అవసరమైన శక్తి, రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయం – ఎక్కువసేపు తృప్తిగా ఉంచడం వల్ల అధిక ఆహారం తినడం తగ్గుతుంది.
జొన్న ఇడ్లీ అనేది సంప్రదాయ రుచిని, ఆధునిక ఆరోగ్య అవసరాలను కలిపిన అద్భుతమైన అల్పాహారం. ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు సమృద్ధిగా లభించే ఈ ఇడ్లీలు ప్రతి ఇంట్లో తప్పక ప్రయత్నించాల్సిన ఆరోగ్యకరమైన వంటకం. రోజువారీ ఆహారంలో మిల్లెట్స్‌ను చేర్చడం ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రుచికరమైన, మృదువైన, ఆరోగ్యపరమైన జొన్న ఇడ్లీతో మీ ఉదయాన్ని ఆరోగ్యవంతంగా ప్రారంభించవచ్చు.
హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హోమ్ రెమిడీస్, పేరెంటింగ్ టిప్స్, రిలేషన్‌షిప్ గైడెన్స్, ఫిట్‌నెస్, యోగా టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ స్టోరీస్‌ని న్యూస్ 18 తెలుగు లైఫ్‌స్టైల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Srikakulam,Srikakulam,Andhra Pradesh


