Job Calendar: ఏపీ యువతకు ఉగాది కానుక.. వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే? | జాబ్స్ & ఎడ్యుకేషన్


Last Updated:

AP Job Calendar: ఏపీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండగ తీపి కబురు చెప్పింది. వేల సంఖ్యలో పోస్టుల భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈసారి శాఖలు పరంగా ఖాళీలు, నోటిఫికేషన్ తేదీలు, సిలబస్ అన్నీ పొందుపర్చారు.

jobs
jobs

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను ప్రకటించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్పష్టత ఇస్తూ మొత్తం 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జాబ్ క్యాలెండర్‌లో కేవలం ఉద్యోగాల సంఖ్య మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీలు కూడా ముందుగానే ప్రకటించడం విశేషం. దీని ద్వారా అభ్యర్థులు తమ పరీక్షల ప్లాన్ ముందుగానే ప్లాన్ చేసుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి మంచి అవకాశం లభించింది.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇందులో గ్రూప్-1 సేవలకు 91 పోస్టులు, గ్రూప్-2 సేవలకు 278 పోస్టులు, ఇతర ముఖ్య విభాగాల్లో 928 పోస్టులు ఉన్నాయి. అదనంగా పోలీస్ శాఖలో 1500 పోస్టులు, ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా మెగా డీఎస్సీ ద్వారా 3004 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ అన్ని పోస్టులు కలిపి మొత్తం 10,060 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక నోటిఫికేషన్ తేదీల విషయానికి వస్తే మే 15, 2026 నుంచి కొన్ని విభాగాల నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 15న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15న పోలీస్, ఇతర శాఖల నియామకాలు, అక్టోబర్ 15న ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ముందుగానే సిలబస్ విడుదల: 

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలను నిర్ణయించిన సమయానికి నిర్వహించి, ప్రకటించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు సిలబస్‌ను కూడా ముందుగానే విడుదల చేయనున్నారు. ఉద్యోగార్థులకు మరింత సౌకర్యం కల్పించేందుకు “నైపుణ్యం” పోర్టల్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు మరియు ఇతర ముఖ్య సమాచారం సమయానికి అందుతుంది. ఇకపై ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా ఉద్యోగాల ప్రకటన చేయడం ఒక సంప్రదాయంగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యువతలో నమ్మకం పెరగడమే కాకుండా, ప్రభుత్వ నియామకాలలో పారదర్శకత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం వివిధ శాఖల్లో పోస్టుల సంఖ్య:

  • గ్రూప్-1 – 91 పోస్టులు
  • గ్రూప్-2 – 278 పోస్టులు
  • ఇతర ముఖ్య పోస్టులు (వివిధ శాఖలు) – 928 పోస్టులు
  • పోలీస్ శాఖ నియామకాలు – 1500 పోస్టులు
  • ఉపాధ్యాయ పోస్టులు (మెగా DSC) – 3004 పోస్టులు
  • ఇతర విభాగాల్లో నియామకాలు – మిగతా పోస్టులతో కలిపి మొత్తం 10,060 ఉద్యోగాలు

ముఖ్య తేదీలు:

  • మే 15, 2026 – కొన్ని విభాగాల నోటిఫికేషన్లు విడుదల
  • ఆగస్టు 15, 2026 – గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టుల నోటిఫికేషన్లు
  • సెప్టెంబర్ 15, 2026 – పోలీస్ మరియు ఇతర శాఖల పోస్టులు
  • అక్టోబర్ 15, 2026 – ఉపాధ్యాయ పోస్టులు (DSC)

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *