Last Updated:
JanaSena MLA Controversy: ఆ మధ్య కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
JanaSena MLA Controversy: ఆ మధ్య కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్‌పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్‌పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో మరొకసారి తెరపైకి హర్షవీణ, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం బయటికి వచ్చింది. ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు చేసి మీడియా ముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ ఆమె ఏం మాట్లాడారో ..? ఎందుకు అరవ శ్రీధర్ని ఇంతలా టార్గెట్ చేసిందో తెలియాలంటే ఈస్టోరీ పూర్తిగా చదవండి.
జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై హర్ష వీణ అనే మహిళ మరొకసారి బలమైన ఫిర్యాదు చేసింది. గతంలో ఎమ్మెల్యేతో ఏకాంతంగా దిగిన ఫోటోలు, పర్సనల్ వీడియోలను నెట్టింట్లో రిలీజ్ చేసి ఆరోపణలు చేసిన యువతి ఇప్పుడు మరోసారి జనసేన ఎమ్మెల్యే పరువును బజారుకీడ్చే ప్రయత్నం చేసింది. లైంగిక వేధింపుల పేరుతో ఎమ్మెల్యే పేరును మీడియాలో సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రదర్శించిన బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేక టీంను రైల్వే కోడూరు ఎంక్వయిరీ నిమిత్తం పంపించారు. అయితే ఎంక్వైరీకి వెళ్లిన అరవ శ్రీధర్ అనేక విషయాలు వివరించి మీడియా ముఖంగా నాపై ఉన్న ఆరోపణ నేపథ్యంలో క్లీన్ చీట్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పిన విషయాన్ని ఈసందర్భంగా బాధిత మహిళ మరొకసారి గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హైకమాండ్ ఆదేశించినప్పటికి ఆయన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అసలు ఆ టీమ్ ఎంక్వయిరీ చేసి ఏం తేల్చారంటూ? ప్రశ్నిస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా రైల్వే కోడూరులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో లిఖితపూర్వకంగా హర్షవీణ మరొకసారి తెలుగుదేశం పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు. ఆమె సమస్యను మీడియా ముఖంగా పేర్కొన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించాలని తనకి న్యాయం చేయాలని ఆమె మరోసారి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉందన్న వ్యవహారంలో మరొకసారి అరవ శ్రీధర్ పై హర్ష వీణ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మళ్లీ ఈ పాత వ్యవహారంపై చర్చ మొదలైంది.
Kakinada,East Godavari,Andhra Pradesh


