Jabardasth Actors: పైడితల్లి అమ్మవారి జాతరలో జబర్దస్త్ నటులు సందడి.. హైపర్ ఆది పంచ్‌లతో మార్మోగిన రాజాం! |


Last Updated:

రాజాం పట్టణంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరలో జబర్దస్త్ టీమ్, తారక్ ఈవెంట్స్ బృందం వినోదం, భక్తి కలిపి సందడి చేశారు. భద్రతా చర్యలతో ఉత్సవం విజయవంతం.

Rapid Read
+

రాజాంలో

రాజాంలో సందడి చేసిన జబర్దస్త్ నటులు

రాజాం పట్టణంలో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం 100వ జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ టీమ్ పాల్గొనడంతో జాతర వేదిక నవ్వులతో మార్మోగింది.

ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కామెడీ స్టార్స్ హాజరై ప్రత్యేక స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. హైపర్ ఆది, రేంజింగ్ రాజ్, శాంతి స్వరూప్, దొరబాబు, జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు తదితరులు తమ వినోద ప్రదర్శనలతో అలరించారు. హైపర్ ఆది తన ప్రత్యేక శైలిలో సమకాలీన అంశాలపై వ్యంగ్యంగా మాట్లాడి ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లు అందుకున్నారు. రేంజింగ్ రాజ్, దొరబాబు తమ టైమింగ్ కామెడీతో నవ్వుల పువ్వులు పూయించారు.

శాంతి స్వరూప్ తన విభిన్న హావభావాలతో ఆకట్టుకోగా, యాంకర్ సౌమ్య రావు చురుకైన వ్యాఖ్యలతో మంచి డాన్స్ పర్ఫామెన్స్ తో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నడిపించారు. ప్రత్యేకంగా రూపొందించిన స్కిట్లు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రదర్శించటంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా వీక్షించారు. జాతర వేదికపై నవ్వుల సందడి నెలకొనడంతో భక్తి, వినోదం కలిసిన అద్భుత వాతావరణం ఏర్పడింది.

ఇక తారక్ ఈవెంట్స్ బృందం అందించిన ప్రత్యేక నృత్య ప్రదర్శనలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ల మధ్య యువతీ యువకులు చేసిన డాన్స్ ప్రదర్శనలు కనుల విందుగా నిలిచాయి. జాతర వేదిక సాయంత్రం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది. పట్టణ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు, ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు.

ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదిక చుట్టూ భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కమిటీ సభ్యులు స్వచ్ఛంద సేవకులతో కలిసి జనసమ్మర్ధాన్ని సమర్థవంతంగా నియంత్రించారు.

జాతరలో భాగంగా నిర్వహించిన ఈ వినోద కార్యక్రమం భక్తులకు మరింత ఉత్సాహాన్ని కలిగించిందని నిర్వాహకులు తెలిపారు. శతాబ్ది జాతర సందర్భంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసిందని పోలీసులు, కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

జాతర సందర్భంగా రాజాం పట్టణం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. పట్టణమంతా రంగురంగుల దీపాలతో అలంకరించగా రాత్రి వేళల్లో ప్రత్యేక శోభ కనిపిస్తోంది. జాతర ప్రాంగణంలో జెయింట్ వీల్, కొలంబస్, మినీ ట్రైన్, డిస్కో డాన్స్ కార్యక్రమాలు సందడి చేస్తున్నాయి. చిన్నపిల్లల కోసం బోటింగ్, రంగుల రాట్నం వంటి వినోద ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల స్టాళ్లు, తినుబండరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ సమేతంగా భారీగా తరలివస్తున్న భక్తులు, సందర్శకులతో జాతర ప్రాంగణం కళకళలాడుతోంది. పోలీసుల భద్రతా ఏర్పాట్ల మధ్య ఉత్సవం శాంతియుతంగా కొనసాగుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *