International Fleet Review | సముద్రంలో యుద్ధనౌకలు ..విశాఖలో సందడి



విశాఖ సాగరం ప్రపంచ యుద్ధనౌకల గర్జనతో హోరెత్తింది. బుధవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని భారత నౌకాదళ సత్తాను, స్నేహపూర్వక దేశాల శక్తిని సమీక్షించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ‘ఐఎన్ఎస్ సుమేధ’ (INS Sumedha) యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను వీక్షించారు. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అమెరికా, రష్యా, జపాన్ వంటి 50కి పైగా దేశాల ప్రతినిధులు, యుద్ధనౌకలు ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యంగా నిలిచాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *