Last Updated:
Inspiring Story: కొండగొర్రి కార్తీక్ అనే యువకుడికి 8 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ తగిలి రెండు చేతులు సగం వరకు కోల్పోయాడు. 3వ తరగతి చదువుతున్న సమయంలో వైకల్యుడిగా మారినప్పటికి మనోధైర్యం కోల్పోలేదు.
Inspiring Story: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మవిశ్వాసం అందరికి ఆదర్శంగా మారింది. కోదుల వీరఘట్టం గ్రామానికి చెందిన కొండగొర్రి కార్తీక్ అనే యువకుడికి 8 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ తగిలి రెండు చేతులు సగం వరకు కోల్పోయాడు. 3వ తరగతి చదువుతున్న సమయంలో రెండు చేతులు పోయినప్పటికి మనోధైర్యం కోల్పోకుండా మోచేతులతోనే పరీక్షలు రాసుకుంటూ అందరికి స్పూర్తిగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాడు.
చదువు, సంస్కారం ఎవరు దోచుకోలేని జ్ఞాన సంపద. అందుకే వాటిని ఇష్టపడే వారికి అవి ఎంతగానో గుర్తింపు, పేరు ప్రతిష్టలు తెచ్చి పెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వీరఘట్టానికి చెందిన కె. కార్తీక్ తన అంగవైకల్యాన్ని జయించి చదువులో ప్రతిభ కనబరిచి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఎనిమిదేళ్ల వయసులో విద్యుత్ షాక్కు గురై రెండు చేతులను కోల్పోయినప్పటికీ అతను నిరాశ చెందలేదు. శారీరక లోపం తన లక్ష్యాలకు అడ్డంకి కాదని నిరూపిస్తూ పట్టుదలతో ముందుకు సాగాడు.
ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురంలోని ఓ వృత్తిపర కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా తనంతట తానే ఇంటర్ పరీక్షలు రాస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటూ సంకల్పబలం ఉంటే వైకల్యం అడ్డురాదని కార్తీక్ చూపించాడు. అతని ధైర్యసాహసాలు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అతని పట్టుదలను అభినందిస్తున్నారు. జీవితంలో ఏ సమస్య వచ్చినా దృఢసంకల్పంతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని కార్తీక్ కథ చెబుతోంది.
8 ఏళ్ల వయసులో జరిగిన ఒక ప్రమాదం ఆ బాలుడి జీవితాన్ని తలకిందులు చేసేసిందని అందరూ భావించారు. కరెంట్ షాక్ తగిలి రెండు చేతులను కోల్పోయిన ఆ చిన్నారి జీవితం అక్కడితోనే ఆగిపోతుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాని ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరిక అతనిలోని పట్టుదలకు పునాది వేస్తే.. తోటి విద్యార్ధులకు అతని ఆశయం, ఆసక్తి ప్రేరణగా నిలిచింది.
Vizianagaram,Andhra Pradesh


