Last Updated:
AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ అధికారిక జీఓను విడుదల చేసింది. శివరాత్రి రోజు భక్తులు రాత్రంతా జాగారం, ఉపవాసం ఉండే ఆచారం ఉంది. దీంతో మరుసటి రోజు విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారికి కల్పించింది.
హిందువుల ప్రధాన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మహా శివరాత్రిని అంతా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజునే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. ఈ పవిత్ర రోజున భక్తి, పూజలతో శివుడిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయని అంతా విశ్వసిస్తారు. ఈ క్రమంలో భక్తుల ఆధ్యాత్మిక ఆచారాలను దృష్టిలో ఉంచుకుని మహాశివరాత్రి మరుసటి రోజును రాష్ట్ర ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా తీసుకునేందుకు వీలును కల్పించింది.
గతంలో 2025 డిసెంబర్ 4న ప్రభుత్వం ఆ ఏడాదికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితులు, ఉద్యోగుల అభ్యర్థనలను పరిగణనలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ పాత జాబితాకు సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులను ఇప్పుడు వెలువరించింది. ఈ మేరకు గెజిట్‌లో అధికారిక నోటిఫికేషన్ ప్రచురించాలని సంబంధిత విభాగాలను సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఫిబ్రవరి 16న ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు కూడా ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని డీఈవో రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం స్కూల్స్‌కు ఆప్షనల్ హాలిడే మంజూరు చేసినప్పటికీ, పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల కారణంగా పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరై ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
మహా శివరాత్రి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల 34 నిమిషాల వరకు కొనసాగుతుంది. అయితే ప్రధాన పర్వదినం ఫిబ్రవరి 15ననే నిర్వహించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 16న సెలవు ప్రకటించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 15న శివరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16ను ఐచ్చిక సెలవుగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



