Last Updated:
గోదావరి జిల్లాలో కాకినాడ సమీప దివిలి గ్రామంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో ఐదు రోజుల ఘన కళ్యాణ మహోత్సవాలు, వేలాది భక్తుల రద్దీ
అక్కడ రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన శృంగార వల్లభ స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. సాక్షాత్తు దేవతలే నిర్మించిన ఈ ఆలయాన్ని సైతం అక్కడ ఏడు వారాల ఆలయంగా భక్తులు పిలుస్తూ ఉంటారు. పచ్చని గ్రామీణ ప్రాంతంలో వెలసిన స్వామివారిని దర్శిస్తే చాలు మనలో ఉన్న సమస్యలు వైదొలగిపోతాయని అనేకమంది భక్తులు పాదయాత్రగా చేరుకుంటూ ఉంటారు.
ఈ క్షేత్రంలో 2000 సంవత్సరాల కిందటి నాటి నూతిలో నీళ్లు తాగిన స్నానమాచరించిన వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, కలుగుతుందని అక్కడ చరిత్ర చెబుతుంది. అటువంటి స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంతకీ అలాంటి దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఆ చరిత్ర ఏంటి ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
గోదావరి జిల్లాలో కాకినాడ సమీపాన పెద్దాపురం మండలం దివిలి గ్రామం, చెప్పడం కాదుగాని పచ్చని కొబ్బరి తోటలకు ప్రసిద్ధిగా ఈ గ్రామం ఆకట్టుకుంటూ ఉంటుంది, అటువంటి గ్రామంలో 2000 సంవత్సరాల కిందట దేవతలే స్వయంగా శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు.
ఇక్కడ స్వామి ప్రధాన చరిత్ర ఏమిటి అంటే, మనం ఎంత ఎత్తునుంచి స్వామిని దర్శిస్తే మనకు అంతే ఎత్తులో స్వామి కనిపిస్తూ ఉంటారు. ఈ స్వామిని సైతం ఏడువారాల శృంగార వల్లభ స్వామి అని భక్తులు పిలుస్తూ ఉంటారు, సుదూర గ్రామాల నుంచి ఈ స్వామిని దర్శించేందుకు భక్తులు ప్రతిస్థిరవారం పాదయాత్రగా చేరుకుంటూ ఉంటారు. ఆలయంలో గల రెండు వేల సంవత్సరాల కిందటనాటి నూతిలో నీళ్లు తాగిన స్నానమాచరించిన వివాహం కానివారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ప్రాప్తి చెందుతుందని అక్కడ రాతలు చెబుతున్నాయి.
కళ్యాణం కమనీయంగా ఎంతో చరిత్ర కలిగిన శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా, పెళ్లికొడుకు పెండ్లికూతురుగా ముస్తాబు చేయుట, ఆపై కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. అశేష భక్తజనులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. దివిలి గ్రామం ప్రారంభం మొదలు దివ్య క్షేత్రం వరకు కళ్ళుమిరిమెట్లు కమ్మే విద్యుత్ కాంతులు దేవస్థానం ఏర్పాటు చేసింది.
మరోపక్క అందమైన పువ్వుల పందిరిలో స్వామివారి కల్యాణాన్ని కమనీయంగా ఈ ఏడాది నిర్వహించింది. కళ్యాణం అనంతరం జరుగు కార్యక్రమాల సైతం మరొక మూడు రోజులు పాటు ఈ దివ్య క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి, దీంతో అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 31, 2026 11:26 AM IST


