Helmet Campaign: హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపితే పోలీసులే డబ్బులిస్తారు.. ఇలా చేయండి చాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

+

హెల్మెంట్

హెల్మెంట్ పెట్టుకో…బహుమతి అందుకో  ఇది చిత్తూరు జిల్లాలో విన్నూతన కార్యక్రమం

Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెంట్ పెట్టుకో బహుమతి అందుకో అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషారా డూడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా  అంతటా శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలోని రహదారులపై ప్రయాణించే టూ వీలర్ రైడర్స్ హెల్మెంట్ ధరించి ఫొటోతో పాటు మీ పూర్తి వివరాలు సోషియల్ మీడియా ద్వారా వాట్సప్,ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్  పోలీసులు నిర్ణయించిన ఐ డి కి పంపితే చాలు బహుమతి పొందవచ్చు. దీనికి సంబంధించి మీరేం చేయాలో పోలీసులు వివరంగా తెలిపారు.

పోలీసులే బహుమతులిస్తారంట..

గతంలో హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపితే బైక్ రైడర్స్‌కి ఫైన్ విధించిన పోలీసులే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపితే బహుమతులు ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో హైవే, కూడళ్లలో రెగ్యులర్‌గా ప్రయాణించే వారు హెల్మెట్ పెట్టుకున్న ఫోటోతో పాటు వారి వివరాలను పోలీసులు ఇచ్చే స్లిప్‌లో రాసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు చేరవేస్తే చాలు.. అందులోంచి లక్కీ విజేతలను ఎంపిక చేస్తారు. ఎస్పీ చేతుల మీదగా రూ.167000 విలువ గల వివిధ రకాల బహుమతులు పొందవచ్చని జిల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్య బాబు తెలిపారు.

హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు..

హెల్మెట్ పెట్టుకుంటే బాహుమానాలు, పెట్టుకోకుంటే జరిమానాలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న చర్చల్లో భాగంగా హెల్మెట్ దరించడాన్ని ప్రోత్సహించడానికి “హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు” అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించిన వారికి బహుమతులు ఇవ్వబడతాయిహెల్మెట్ ధరించండి సురక్షితంగా ఉండండి బహుమతులు గెలవండి అని వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు.హెల్మెట్ ధరించకపోతే 1035/-జరిమానా, 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్, మరియు ప్రాణాలకు ప్రమాదం న్నారు. ఈ కార్యక్రమం06-04-2026 “నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.రైడర్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదా గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్, షెర్మన్ స్కూల్ జంక్షన్, ఉదిపి జంక్షన్, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోర్టు జంక్షన్ వంటి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నచోట ప్రత్యక్షంగా నమోదు చేసుకోవచ్చు.

ఇలా అప్లై చేయండి..

సోషల్ మీడియా ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు క్రింది నెంబర్ ను తెలిపారు.9154881257రైడర్ పై పేర్కొన్న జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే రెండు స్లిప్లపై తన వివరాలను నమోదు చేయాలి. ఒక స్లిప్ నెలవారీ డ్రా (నగదు బహుమతి) కోసం, మరొక స్లిప్ వారాంత డ్రా (ఆశ్వాస బహుమతి) కోసం ఉంటుందన్నారు.మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.9491074515మోటర్ సైకిళ్ళ రైడర్లను 7 విభాగాలుగా విభజించారు.

అందరూ అర్హులే..

రైడర్,స్కూల్ సిబ్బంది,స్కూల్ కు తీసుకొచ్చే తల్లిదండ్రులు, 18 నుండి 35 సంవత్సరాల యువత, మహిళా రైడర్లు 35 సంవత్సరాలు పై బడిన వారు, పురుషులు 35 సంవత్సరాలు పై బడిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రెస్ న్యాయ వాదులు,సోషియల్ మీడియా ప్రభావశీలలు,స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఇలా రైడర్లను ఎంపిక చేశారు. వీరిలో ఒకొక్క విభాగం కింద  మొదటి,రెండు,మూడు ఇలా బహుమతులు ప్రధానం చేస్తారు. మొత్తంగా 167000 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *