Heartwarming Story: ట్రైన్‌లో పరిమళించిన మానవత్వం.. బోగీలోనే సుఖ ప్రసవం |


Last Updated:

Heartwarming Story: కామన్‌గా ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు తోచుకోవడం, సీటు కోసం గొడవపడటం చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే పక్క సీట్లో వారితో వాగ్వాదానికి దిగడం చాలా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

baby born in train
baby born in train

Humanity in Train: సౌకర్యం, సేఫ్టీ, సుఖం, ఖర్చు తక్కువ అనే ఆలోచనతోనే చాలా మంది తమ ప్రయాణాన్ని రైళ్లలో కొనసాగించడానికి మక్కువ చూపుతారు. మరీ ముఖ్యంగా వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, ప్రసూతి మహిళలు, పిల్లలతో జర్నీ చేయాలనుకునే వారికి రైలు ప్రయాణమే అత్యంత భద్రమని మరోసారి నిరూపణైంది. ఈనెల 5వ తేది నాడు ఆదివారం ట్రైన్ నంబర్ 13352 అల్లప్పుజా – ధన్ బాద్ బొకారో ఎక్స్ప్రెస్‌లో జర్నీ చేస్తున్న ఓ గర్భిణికి ప్రయాణంలోనే పురిటి నొప్పులు రావడంతో గమ్య స్థానం చేరుకోక ముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈవిషయంలో ట్రైన్‌లో టీటీఈతో పాటు మరికొందరు రైల్వే సిబ్బంది, తోటి మహిళా ప్రయాణికులు పురిటినొప్పులతో బాధపడుతున్న తల్లిని ఆమె కడుపులో ఉన్న బిడ్డను కాపాడేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో అప్పటి వరకు ఏం జరుగుతుందో అని కంగారుపడిన రైల్వే స్టేషన్‌లోని వారంతా హ్యాపీగా నవ్వుతూ జర్నీ కొనసాగించారు.

పరిమళించిన మానవత్వం..

రైల్లో ప్రయాణం చేసే సందర్భాల్లో మనం అనేక విచిత్రమైన, వింత దృశ్యాలు, సంఘటనలు చూస్తూ ఉంటాం. కాని మానవత్వాన్ని చాటుకునే సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. రెండ్రోజుల క్రితం విజయవాడ స్టేషన్ నుండి బయల్దేరిన అల్లప్పుజా – ధన్ బాద్ బొకారో ఎక్స్ప్రెస్‌ ట్రైన్‌లో గర్భిణి తరన్నుమ్ తన భర్త ఇషాద్, తల్లి రజియాతో కలిసి ప్రయాణిస్తోంది. అయితే తుని స్టేషన్ దాటగానే గర్భిణి మహిళకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. అయితే ట్రైన్‌లో ఉన్న టీటీఈ జ్యోతి రాబోయే స్టేషన్‌లో గర్భిణి ప్రసవానికి సంబంధించిన అంబులెన్స్, ఇతర వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని సమాచారం చేరవేసింది. అయితే అప్పటికే మహిళకు నొప్పులు అధికం కావడంతో ట్రైన్‌ని యలమంచిలి స్టేషన్‌లో ఆపారు. టీటీఈతో పాటు రైల్వే సిబ్బంది, బీ1 బోగీలో ఉన్న మహిళకు నార్మల్ డెలివరీ చేయాలని లోపలున్న పురుష ప్యాసింజర్లను ట్రైన్‌ బోగి నుండి బయటకు పంపారు. అదే సమయంలో ఆమెకు పురుడు పోశారు.

సుఖ ప్రసవం..

అప్పటి వరకు గర్భిణి మహిళ భర్త, తల్లితో పాటు ట్రైన్‌లో ఎక్కిన వాళ్లు, రైల్వే స్టేషన్‌ సిబ్బంది సైతం తల్లి, బిడ్డకు ఏమౌతుందో అని కంగారుపడిపోయారు. అయితే అందరూ సమయస్పూర్తితో వ్యవహరించి తరన్నుమ్ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అందరి ముఖాలు ఆనందంతో కనిపించాయి. అక్కడి నుండి ప్రసూతి మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు రైల్వే సిబ్బంది.

రైల్వే సిబ్బంది సేవలు భేష్..

కామన్‌గా ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు తోచుకోవడం, సీటు కోసం గొడవపడటం చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే పక్క సీట్లో వారితో వాగ్వాదానికి దిగడం చాలా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. రైల్వే సిబ్బందిలో కూడా చాలా మంది ఓర్పు, నేర్పు లేకుండా ప్రవర్తించడం గమనిస్తుంటాం. కాని బొకారో ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఓ మహిళకు పురుడు పోసి బిడ్డ ప్రాణాలు కాపాడిన తీరు చూసి రైల్వే సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు. ఈవిషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *