Gooty Fort Utsav 2026: ఈనెల 14, 15న గుత్తి కోట ఉత్సవాలు.. పర్యాటకుల కోసం భారీ ఏర్పాట్లు | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Gooty Fort Utsav 2026
Gooty Fort Utsav 2026

Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండ్రోజుల పాటు గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఉత్సవాలను పెద్దఎత్తున జయప్రదంగా నిర్వహించాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుత్తి కోట ఉత్సవాలు-2026పై సమన్వయ సమావేశాన్ని సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.

రెండ్రోజుల పాటు ఉత్సవాలు..

అనంతపురం జిల్లా గుత్తిలోని ఫుట్ బాల్ మైదానంలో రెండు రోజులు పాటు భారీ ఎత్తున గుత్తి కోట ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖల అధికారులు సహకారం, సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. గుత్తి కోట ఉత్సవాల నిర్వహణ కోసం ఇన్ఫాస్ట్రక్చర్ కమిటీ, ప్రోటోకాల్, రిసెప్షన్ అండ్ అకామిడేషన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, స్టేజ్ కమిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కమిటీ, ఎగ్జిబిషన్ స్టాల్స్ కమిటీ, ఈవెంట్స్ కమిటీ, ఫోర్ట్ కమిటీ, ఫుడ్ కమిటీ మెమెంటోస్ కమిటీ, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కమిటీ, పబ్లిక్ మొబైలైజేషన్ కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, స్కూల్కాంపిటీషన్స్ కమిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పార్కింగ్ కమిటీ, మెడికల్ క్యాంపుల కమిటీ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది.

అన్నీ శాఖల సమన్వయంతో..

ఉత్సవాలను ఆయా శాఖల జిల్లా అధికారులు బాధ్యతగా తీసుకొని పనిచేయాలని, ఆయా శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఖ్యాతి పెంపొందించేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు ఏర్పాటు ఉండాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచడం, క్లీనింగ్ అండ్ శానిటేషన్ ఏర్పాటు, విస్తృతంగా ప్రచారం నిర్వహించడం చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఆయా శాఖలో పరిధిలో స్టాల్స్ ఏర్పాటుచేయాలని, వివిఐపి, ప్రోటోకాల్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు.

భారీ ఏర్పాట్లు..

ఉత్సవాల కోసం బందోబస్తు జాగ్రత్తగా చేయాలని, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గుత్తి కోట ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎఓ మలోల, జిల్లా టూరిజం, అధికారులు అధికారి జయకుమార్ బాబు, గుంతకల్లు ఆర్డీవో ఆర్బిఎస్కే శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి రవి, ఏపీఎమ్బపి పిడి రఘునాథరెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడి వరప్రసాద్, మెప్మా పీడీ విశ్వజ్యోతి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డి.ఎల్డీవో విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, ఎండోమెంట్ ఎసి మల్లికార్జున ప్రసాద్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారి శైలేంద్ర ఆర్. అండ్.బి ఈఈ రాజగోపాల్, డిఎస్ఐ వెంకటేశ్వర్లు, సివిల్ సపై డిఎం రమేష్ రెడ్డి, గుత్తి తహసిల్దార్ పుణ్య వతి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగెశ్వరిదేవి, ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *