ప్రముఖ వెబ్ సైట్ గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం మార్చి 17 (మంగళవారం) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.660 పెరిగి రూ.1,57,420 నుంచి రూ.1,58,080కి చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ.1,44,300 నుంచి రూ.1,44,900కి వచ్చింది. 18 క్యారట్ గోల్డ్ ధర రూ.490 పెరిగి రూ.1,18,070 నుంచి రూ.1,18,560కి చేరింది.



