24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.10,320 తగ్గి రూ. 1,45,970 నుంచి రూ.1,35,650కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.9,450 తగ్గి రూ.1,33,800 నుంచి రూ.1,24,350కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.7,740 తగ్గి రూ.1,09,480 నుంచి రూ.1,01,740కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.22 వేలకు పైగానే పతనం అయింది.



