Girlfriend Murder: ఆ మాట అన్నందుకే ముక్కలు ముక్కలుగా నరికాడు..! వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో ట్విస్ట్ ఇదే | ట్రెండింగ్


Last Updated:

Girlfriend Murder : చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు.

Girlfriend Murder
Girlfriend Murder

Shocking News: చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. కేవలం నమ్మి ఇంటికి వచ్చిన ఒంటరి మహిళను అత్యంత కిరాతకంగా, ఎవరూ ఊహించనంత పాశవికంగా ఒక్కమాటలో చెప్పాలంటే క్రూరమృగాలు సైతం మనిషిని చంపలేనంత దారుణంగా హతమార్చిన నరరూపహంతకుడే ఈ రవీంద్ర. అయితే మార్చి 30న జరిగిన ఈ లేడీ మర్డర్ కేసులో కారణాలు తెలుసుకునేందుకు గాజువాక పోలీసులు 5 టీమ్‌లను ఏర్పాటు చేశాయి. అయితే ఈ బృందాలు ఇప్పటికే కొన్ని ప్రాధమిక వివరాలు సేకరించినప్పటికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి.

పెళ్లాం ఊరెళ్లిన టైమ్‌లో..

విశాఖపట్నం ఎల్వీనగర్ రోడ్డు నంబర్ 20లో గత నెల 30వ తేది నాడు ఓ ఇంట్లో యువతి హత్యకు గురైంది. అయితే ఆమె మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. కారణం ఏమిటంటే హంతకుడు చింతాడ రవీంద్ర ఆమెను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేసి ప్రిజ్‌లో పెట్టాడు. అనంతరం తానే స్వయంగా పోలీసుల దగ్గరకు వెళ్లి నేరం ఒప్పుకొని లొంగిపోయాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రిజ్‌లో దాచిన యువతి శరీర భాగాలను రికవరీ చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం పంపారు. ఆ తర్వాత అసలు హంతకుడు ఎవరూ..? మృతురాలు అతనికి ఏమౌతుంది..? ఎందుకు అంత కిరాతకంగా హతమార్చాడు ? ఈ అంశాలపై పూర్తి వివరాలు రాబట్టేందుకు రిక్రియేషన్ కోసం పట్టుకొచ్చారు.ఆ తర్వాత పోలీసులు ఈ కేసును లోతుగా విచారించడానికి 5 ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపాయి.

డేటింగ్ యాప్‌లో పరిచయం..

హంతకుడు చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. మృతురాలి పేరు మౌనిక. 2021లో మౌనిక ఒక డేటింగ్ యాప్ ద్వారా రవీంద్రకు పరిచయమైంది. నాటి నుంచి వారి మధ్య రిలేషన్ కొనసాగుతోంది. 2023లో రవీంద్ర రాజాంకు చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా మౌనికతో రిలేషన్ కొనసాగిస్తూ వచ్చాడు. ఈక్రమంలోనే రవీంద్ర భార్య గర్భిణిగా ఉండటంతో ఆమె బిడ్డను కనేందుకు పుట్టింటింకి వెళ్లింది. అయితే ఇదే మంచి సమయం అనుకున్న రవీంద్ర ఆమెను తన ఇంటికి పిలించుకున్నాడు. మార్చి 30న ఆమెను గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అటుపై ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. మౌనిక శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కొన్ని ఫ్రిజ్ లో ప్యాక్ చేసి పెట్టాడు. తల మరికొన్ని శరీర భాగాలను అడవివరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టి, మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, కాళ్ళను సూట్ కేసులో పెట్టినట్లుగా విశాఖ సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు తెలిపారు. అంతే కాదు హత్య చేసిన తర్వాత తప్పించుకునేందుకు మార్గం లేకపోవడం వల్లే లొంగిపోయినట్లుగా పోలీసులు తేల్చారు.

హత్యకు దారి తీసిన పరిణామాలు..

మౌనిక హత్య కేసులో పూర్తి వివరాలు, హత్య చేయడానికి కారణాలు తెలుసుకునేందుకు గాజువాక పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లుగా సీఐ పార్ధసారధి తెలిపారు. సీన్ రిక్రియేషన్ కోసం నిందితుడు రవీంద్రాను పోలీసులు గాజువాక పట్టుకొచ్చారు. అయితే రవీంద్ర వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నుండి మౌనిక తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అంతే కాకుండా తన ఖర్చులు, మెయిన్‌టెనెన్స్ కోసం డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే గత ఆదివారం రవీంద్ర ఇంటికి వచ్చిన సమయంలో కూడా డబ్బు విషయంలోనే ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాతే నేవీ ఉద్యోగి ఆమెను హతమార్చినట్లుగా పోలీసులు భావించారు. కాని రవీంద్ర ఆమెను చంపడానికే ఇంటికి పిలిపించారనే వాదన కూడా వినిపిస్తోంది. సీన్ రీ క్రియేట్ చేసేందుకు ఘటన స్థలం వద్దకు పోలీసులు నిందితుడిని తీసుకెళ్లారు. సీన్ రీ క్రియేట్ చేసేందుకు వెళ్లిన సమయంలో నిందితుడు రవీంద్రను మృతురాలు మౌనిక కుటుంబ సభ్యులు కొట్టారు. రవీంద్రను తమకు అప్ప చెప్పాలని డిమాండ్ చేశారు.  అయితే రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *