Giant King Cobra: జనం మధ్యకు వచ్చిన 15 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ చూసి షివరైన కాలనీ వాసులు | ట్రెండింగ్


Last Updated:

Giant King Cobra: విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని వీలుపర్తి పంచాయతీ వెళ్లాం గ్రామంలో భారీ గిరినాగు (కింగ్ కోబ్రా) ప్రత్యక్షమై స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.

+

వీధి

వీధి కాలువలో 15 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్ చల్ గ్రామస్థుల్లో భయాందోళన

Giant King Cobra: విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని వీలుపర్తి పంచాయతీ వెళ్లాం గ్రామంలో భారీ గిరినాగు (కింగ్ కోబ్రా) ప్రత్యక్షమై స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. బుధవారం మధ్యాహ్నం గ్రామంలోని ఓ వీధి కాలువలో సుమారు 15 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా అడవులు, పొదలు, తడి ప్రాంతాల్లో సంచరించే ఈ భారీ విషసర్పం జనావాస ప్రాంతంలోకి రావడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు.

మొదట కాలువలో ఏదో కదులుతున్నట్లు గమనించిన కొందరు దగ్గరగా వెళ్లి చూడగా భారీ పాము కనిపించింది. వెంటనే ఆ విషయం చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో గ్రామంలో కలకలం రేగింది. పిల్లలను ఇళ్లలోనే ఉండమని పెద్దలు హెచ్చరించగా, కొందరు ఆసక్తితో దూరం నుంచి పామును వీక్షించారు.

ఈ నేపథ్యంలో స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అతను తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాడు. వెలమల వీధి సమీపంలోని కాలువలో సంచరిస్తున్న గిరినాగును ఎంతో చాకచక్యంగా, జాగ్రత్తగా పట్టుకున్నాడు. భారీ పరిమాణం, వేగంగా కదిలే స్వభావం కారణంగా ఆ ఆపరేషన్ కొంతసేపు ఉత్కంఠభరితంగా సాగింది. అక్కడ గుమిగూడిన గ్రామస్థులు ఉత్కంఠగా గమనిస్తుండగా చివరకు పామును సురక్షితంగా బంధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఆ పాముని అడవిలో వదిలిపెట్టాడు.

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం, ఆహారం కోసం సంచారం, నీటి కోసం వెతకడం వంటి కారణాలతో అడవి ప్రాంతాల్లో ఉండే పాములు గ్రామాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలు, పొదలు వంటి ప్రాంతాలు వీటి తాత్కాలిక ఆశ్రయాలుగా మారుతాయని స్నేక్ క్యాచర్‌ తెలియజేశాడు.. ప్రజలు ఇలాంటి సందర్భాల్లో పామును చంపేందుకు ప్రయత్నించకుండా వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఘటన అనంతరం గ్రామస్థులు కాలువలు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇళ్ల సమీపంలో పొదలు, చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు సూచించారు. భారీ గిరినాగు గ్రామంలో ప్రత్యక్షమైన ఈ సంఘటన వెళ్లాం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఉపశమనం పొందారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *