Gas Shortage: ఏపీలో గ్యాస్ కొరత నిజమేనా..! పలుచోట్ల దుకాణాలు మూసివేసేందుకు సిద్దం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార సముదాయాలపై అధికంగా చూపిస్తుంది. దీంతో ఈవ్యాపారాలను నమ్ముకున్న జీవిస్తున్న వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి.

+

ఏపీలో

ఏపీలో గ్యాస్ కొరత.. మూతపడే దిశగా దుకాణాలు

Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార సముదాయాలపై అధికంగా చూపిస్తుంది. దీంతో ఈవ్యాపారాలను నమ్ముకున్న జీవిస్తున్న వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి. మరోవైపు గృహవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ సైతం దొరుకుతుందా లేదా అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తానికి యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ సరఫరా అనేది తగ్గుముఖం పట్టడంతో ఈ సమస్య ఏపీలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సప్లై లేక దుకాణాలు మూసివేస్తున్న పరిస్థితులు సైతం అక్కడక్కడ ఎదురవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుంది. ముఖ్యంగా నివాసాలకు అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాస్ సరఫరా చేయాలని ఏజెన్సీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది..? ప్రజలు ఏమంటున్నారు..? ఒకసారి క్లుప్తంగా చూద్దాం

వార్ ప్రభావం..

పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశంలో గ్యాస్ కొరత ప్రభావం అధికంగా కనిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎల్పీజీ గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న అనుమానం నేపథ్యంలో ముందస్తుగా ప్రతి నివాసంలో స్పెర్ గ్యాస్ బుక్ చేసుకుని ఇంట్లో పెట్టుకునేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ రేటు పెరిగిపోతుందని ప్రచారం సైతం జోరుగా సాగడంతో నివాసాల్లో ముందుగానే గ్యాస్ తెచ్చుకుంటే ఏమైంది అనే విధంగా బుకింగ్లపై ప్రజలు దృష్టి పెట్టారు. గతంలో ఏన్నడు లేని విధంగా గ్యాస్ బుకింగ్ లు ఒక్కసారిగా భారీగా పెరిగి పోవడంతో గ్యాస్ ఏజెన్సీదారులు సైతం తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

వ్యాపారాలకు తాళం..

ఏపీకి సంబంధించి అనేక ప్రాంతాలలో ప్రతిరోజు ఉదయం టిఫిన్, స్నాక్స్, టి అమ్మే దుకాణాలన్నీ అక్కడే తయారుచేసి అక్కడ అమ్మకాలు నిర్వహిస్తారు. అయితే ప్రతిరోజు వారికున్న వ్యాపారాన్ని బట్టి సగం గ్యాస్, ఫుల్ బండ్ల సైతం అయిపోయే పరిసతులున్నాయి. అటువంటి వారికి ఇక గ్యాస్ దొరికే అవకాశాలు తక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని ప్రాంతాలలో గ్యాస్ లేక దుకాణాల సైతం మూసివేస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే టీ టిఫిన్ దుకాణాలు ప్రస్తుతం కొన్నిచోట్ల మూసి వేయడంతో వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.

ప్రచారాలు నమ్మొద్దు..

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం గ్యాస్ కొరత నేపథ్యంలో స్కూల్స్, హాస్టల్స్ కు నివాసాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ప్రకటన చేసింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రజలందరూ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ప్రతి ఇంటికి ఎప్పటి మాదిరిగానే గ్యాస్ అందుతుందని గోదావరి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. మరొపక్క గ్యాస్ రేటు పెరిగిపోతుంది అన్న అపోహలు సైతం నమోదు అంటూ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా గ్యాస్ కొరత నేపథ్యంలో ముందు ముందుకు ప్రభావం ఏ విధంగా ఉంటుందో అన్న భయం సగటు ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని నివాసాలకు వసతి గృహాలకు స్కూల్స్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *