Last Updated:
ఇరాన్ అమెరికా యుద్ధం ప్రభావం మధ్య తరగతి జీవితం దెబ్బతింది. గ్యాస్ సిలిండర్ కొరతతో తొండపాడు Mahalakshmi ఆత్మహత్యాయత్నం. Naraendra Manohar భరోసా.
సగటు మధ్య తరగతి మహిళ ఏం కావాలని అడుగుతారు మహా అయితే చీర కావాలని లేదంటే ఆదివారం పూట సినిమాకో షికారుకు తీసుకెళ్లాలని అడుగుతారు బంగారు నగలు కావాలని అడుగుతారు ఇది సహజమే అనాదిగా వస్తోంది. ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ అనంతపురం జిల్లాలోని ఒక నిరుపేద సామాన్యుడి భార్య ఆత్మహత్యా చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది ఇరాన్ అమెరికా యుద్ధం.
వివరాల్లోకి వెళ్తే భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తి మండలం లోని తొండపాడులో ఆదివారం జరిగింది. తొండపాడు లోని హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో సిలిండర్ తీసుకురావాలని మహాలక్ష్మి గత మూడు నెలలుగా భర్తకు చెబుతోంది. డబ్బులు లేవన్న కారణంతో అతను సిలిండర్ తీసుకురాలేదు.
కట్టెల పొయ్యిపైనే వంట చేస్తోంది. అయితే డబ్బులు సమకూరడంతో హరికృష్ణ గ్యాస్ సిలిండర్ తేవడానికి గుత్తి పట్టణానికి వెళ్లాడు. అక్కడ గ్యాస్ సిలిండర్ దొరకలేదు. నేను ఎంత చెప్పినా భర్త గ్యాస్ సిలిండర్ తేవడం లేదన్న బాధ తో మహాలక్ష్మి ఆదివారం ఇంట్లో ఫినాయిల్ తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త, కుటుంబసభ్యులు కలిసి గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉంది.
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. దీనివల్ల చాలామంది వినియోగదారులు ఒకేసారి రీఫిల్ బుకింగ్స్ చేయడం వల్ల సాంకేతిక సమస్యలు (సర్వర్ క్రాష్) డెలివరీలో స్వల్ప ఆలస్యం జరుగుతోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందనేది కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.7 లక్షల నుంచి 3.3 లక్షల సిలిండర్లు పంపిణీ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఏజెన్సీలు కావాలనే నిల్వలను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో, అధికారులు తనిఖీలు చేపట్టి సుమారు 800కు పైగా కేసులు నమోదు చేశారు గ్యాస్ కు సంబంధించి ఏ ఇబ్బందులు తలెత్తవని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 30, 2026 10:18 AM IST



