గంగమ్మ జాతరలు అనేవి సంవత్సరం పొడవునా చిత్తూరు జిల్లాలో జరుగుతుంటాయి. అవి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్ణయించిన మాసాలలో, ఏళ్ల ఆనవాయితీ, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార అలవాట్లు పద్ధతిగా పాటించి మరీ చేస్తుంటారు. కానీ జాతర అంటే గ్రామీణ ప్రాంతాల్లో గుర్తొచ్చేది ఒక్కటే కుటుంబాల సమేతంగా, దేశం కానీ దేశంలో ఉన్నా సరే కచ్చితంగా జాతర రోజు ఆ కుటుంబ సభ్యులు ఒక్కటి కావడం అది గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకో తగ్గ విషయం. ఇదే సంస్కృతి నేటి ఆచరించడం, పాటించడం, పూర్వ పద్ధతులను అలాగే కొనసాగించడం జరుగుతున్నది. కొన్ని ఏళ్ళుగా ఆనవాయితీ తో జాతర జరుగుతున్న గ్రామo,11 రోజుల జాతర జరిగే గ్రామo చిత్తూరు జిల్లాలో ఇదే ..!!!



