Free Embroidery Training: ఉచిత మగ్గం వర్క్ శిక్షణ.. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు |


Last Updated:

Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు.

+

ఉచిత

ఉచిత మగ్గం వర్క్ శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు

Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుత కాలంలో మగ్గం వర్క్ ఫ్యాషన్ రంగంలో ఎంతో ట్రెండింగ్‌లో ఉందని మగ్గం వర్క్ ఫ్యాకల్టీ భవాని పేర్కొన్నారు.ముఖ్యంగా మహిళలు ఏ ఫంక్షన్‌కి వెళ్లినా అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారని, అలాంటి సందర్భాల్లో చీరకు అందం తెచ్చేది బ్లౌజ్‌పై చేసే మగ్గం డిజైన్సేనని వివరించారు. బ్లౌజ్‌పై అందమైన మగ్గం డిజైన్లు చేస్తే చీరకు మరింత గ్రాండ్ లుక్ వస్తుందని, పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని భవాని తెలిపారు. అందుకే ఇటువంటి డిజైన్ వర్క్‌లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నైరెడ్ సంస్థ ద్వారా మగ్గం వర్క్‌కు సంబంధించిన వివిధ కోర్సులను ఉచితంగా నేర్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

ఎంబ్రాయిడింగ్ కోచింగ్..

ఈ శిక్షణలో భాగంగా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్, సారీ పెయింటింగ్, టై అండ్ డై వంటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. మొత్తం 30 రోజులపాటు జరిగే ఈ కోర్సులో పూర్తి స్థాయిలో మగ్గం వర్క్‌కు సంబంధించిన ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ శిక్షణ కాలంలో పాల్గొనే యువతకు భోజనం, వసతి, యూనిఫామ్, టూల్ కిట్స్ వంటి అన్ని సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

టెన్త్ పాస్ అయితే చాలు..

ఈ కోర్సులో చేరాలనుకునే వారికి కనీస అర్హతగా పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా సరిపోతుందని, 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న యువత ఈ శిక్షణ పొందడానికి అర్హులని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి నైరెడ్ సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వ తరపున సర్టిఫికెట్ అందజేస్తారని వివరించారు. ఈ శిక్షణ పూర్తయిన తరువాత స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బయటకు వెళ్లి సొంతంగా షాప్ ప్రారంభించాలనుకునే వారికి యూనియన్ బ్యాంక్ ద్వారా అర్హతలను బట్టి రుణాలు కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మగ్గం వర్క్ నేర్చుకున్న వారు తమ స్వగ్రామంలోనే చిన్న షాప్ ప్రారంభించి మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.

ప్రతీ నెల లక్షల్లో ఆదాయం..

ప్రస్తుతం పెళ్లి బ్లౌజ్‌లపై చేసే మగ్గం డిజైన్లకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. బీట్ వర్క్, జడ్వాజీ వర్క్, కట్ బీడ్స్, దద్దోజి, షుగర్ బీట్స్, బంచెస్ వంటి డిజైన్లతో బ్లౌజ్‌లను అలంకరిస్తే అవి మరింత ఆకర్షణీయంగా మారతాయని చెప్పారు. ఇలాంటి బ్లౌజ్‌లకు రూ.2000 నుంచి రూ.10,000 వరకు కూడా తీసుకునే అవకాశం ఉందని వెల్లడి చేశారు.

అసక్తి ఉంటే అప్లై చేసుకోండి..

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మగ్గం వర్క్ శిక్షణ ఇస్తున్న ఫ్యాకల్టీ భవాని కూడా ఒకప్పుడు ఇదే నైరెడ్ సంస్థలో ఈ కోర్సు నేర్చుకున్నారని తెలిపారు. ఆ తరువాత బ్యాంకు రుణం తీసుకుని సొంతంగా షాప్ ప్రారంభించి ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ఇప్పుడు అదే సంస్థలో మళ్లీ ఫ్యాకల్టీగా పని చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె తెలిపారు.మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకునే వారికి ఎటువంటి ఫీజులు లేకుండా పూర్తిగా ఉచితంగా ఈ శిక్షణ అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాన్ని పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందాలని నైరెడ్ సంస్థ ప్రతినిధులు సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *