Free Electricity: ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుల స్వీకరణ.. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Free Electricity: నేతన్నల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తోంది. ఉచిత విద్యుత్ వాటిలో ఒకటి. ఐతే.. దీన్ని పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి.. ఇప్పుడు నేతన్నలు ఎంత బిజీగా ఉన్నా.. ఈ పని పూర్తి చేసుకోవాలి. ఏం చెయ్యాలో చూద్దాం.

దరఖాస్తు చేసుకొని, ఉచితంగా పొందండి
దరఖాస్తు చేసుకొని, ఉచితంగా పొందండి

ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. కొన్ని కండీషన్స్ కూడా పెడతాయి. ఆ అర్హతలు ఉన్నవారికే వాటిని ఇస్తూ ఉంటాయి. అలా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఐతే.. అందరికీ కాదు. అర్హులైన వారికే. దీనిపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత క్లారిటీ ఇచ్చారు. ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారంతా తప్పనిసరిగా పొందేలా చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

దరఖాస్తులకు గడువు:

ఇవాళ ఏప్రిల్ 10. ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. కాబట్టి.. నేతన్నలు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ ఐదు రోజుల్లో వీలు చూసుకొని ఈ పని పూర్తి చేసుకోవాలి.

నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం వివరాలు:

ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ని ఏప్రిల్ 1న అమలు చేసింది. కానీ.. ఆ రోజు నుంచే ఉచిత విద్యుత్ అందరికీ ఇవ్వలేదు. అర్హులై, దరఖాస్తు చేసుకున్నవారికి ఇచ్చింది. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా మగ్గంపై నేసే నేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా, అలాగే మర మగ్గంపై నేసే నేతన్నలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తోంది. అందువల్ల మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, మరమగ్గం నేతన్నలకు రూ.1,860లు ఆదా అవుతుందని వార్త రిపోర్ట్ చేసింది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మంత్రి సవిత ఆదేశాల ప్రకారమైతే.. ఏపీలోని విద్యుత్, చేనేత, జౌళి శాఖల అధికారులు స్వయంగా నేతన్నల దగ్గరకు వచ్చి.. దరఖాస్తు పెట్టిస్తారు. కానీ వాళ్లు రాకపోతే, ఛాన్స్ మిస్సవుతుంది. పైగా 5 రోజులే టైమ్ ఉంది. అందులోనూ ఆదివారం పని జరగదు. కాబట్టి.. నేతన్నలే.. విద్యుత్, చేనేత, జౌళి శాఖల అధికారులను కలవడం మేలు. తద్వారా వారు ఎలా దరఖాస్తు చెయ్యాలో, ఎలా ఉచిత విద్యుత్ పొందాలో చెబుతారు.
నేతన్నలకు మేలు:

నిజంగా ఇదో గొప్ప పథకం. అసలు నేత కార్మికులు చాలా కష్టాల్లో, అప్పుల్లో ఉన్నారు. సరైన ఉపాధి అవకాశాలు వారికి లేవు. ప్రభుత్వ చర్యలు సరిపోవట్లేదు. వారి కెరీర్‌లో గ్రోత్ లేదు. అందువల్ల ఇలా ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా.. ఈ భారం వారికి తగ్గుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే.. ఒంగోలులో ఓ నేతన్నకు నెలకు రూ.1500 కరెంటు బిల్లు వస్తుంటే.. ఇప్పుడు ఉచిత విద్యుత్ కారణంగా.. కరెంటు బిల్లు రూ.800 మాత్రమే పడవచ్చు. తద్వారా ఈ భారం తగ్గగలదు.

ఇవి కూడా చదవండి: Social Media: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. త్వరలో చట్టం. నారా లోకేష్ ఆదేశం

ప్రభుత్వం స్థానిక నేతన్నల వస్త్రాలకు మార్కెట్లలో డిమాండ్ పెరిగేలా చెయ్యాలి. ఇందుకోసం వస్త్ర ఎగ్జిబిషన్స్ లాంటివి అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేస్తే, ప్రజలు స్థానిక ఉత్పత్తులను ఆసక్తిగా కొంటారు. తద్వారా నేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఐతే.. ఇప్పటివరకూ దీనికి దరఖాస్తు చేసుకోని వారు.. వెంటనే ఇది చేసుకోవడం ద్వారా.. ఈ ఉచిత కరెంటును పొందవచ్చు. ఇలా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో నేతన్నలు.. ఈ ప్రయోజనం పొంది తమ జీవితాల్లో కొత్త వెలుగులు తెప్పించుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *