Food Poisoning: బాబోయ్ పులిహోర.. 50మందికిపైగా హాస్పిటల్‌లో అడ్మిట్ |


Last Updated:

Food Poisoning: నంద్యాల జిల్లా కేంద్రంలో కల్తీ ఆహారం పులిహోర తిని 50మంది అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ఆర్ నగర్‌లోని బుడగజంగాల కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

+

Food

Food Poisoning

Nandyal Food Poisoning : కల్తీ ఆహార పదార్ధాలు, , కలుషిత ఆహారం ప్రజల్ని ఆసుపత్రిపాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కల్తీపాల కేసులో ఆసుపత్రిలో చేరిన వాళ్లు ఒక్కొక్కరు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా కేంద్రంలో కల్తీ ఆహారం పులిహోర తిని 50మంది అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ఆర్ నగర్‌లోని బుడగజంగాల కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరో ఇచ్చిన పులిహోర తిన్నందుకు స్థానికులు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలైనట్లుగా వైద్యులు తెలిపారు.

పులిహోర తిన్నందుకు..

వేసవి సీజన్‌లో ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తినే ఆహార పదార్ధాలు, బజారులో దొరికే తినుబండారాలు, ఎవరైనా ఇచ్చే చిరుతిండ్లు, ఫంక్షన్‌లకు వెళ్లినప్పుడు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటన హెచ్చరిస్తోంది. నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్‌లోని బుడగజంగాల కాలనీలో సోమవారం కలుషిత ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురు పెద్దలు, ఆరుగురు పిల్లలు ఉన్నట్లుగా డీఎంఅండ్ హెచ్‌ఓ డా.వెంకటరమణ తెలిపారు.

వాంతులు, విరోచనాలు..

కలుషిత ఆహారం తిన్న వారిలో ఆరుగురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, మరో ముగ్గురిని స్థానిక జీజీహెచ్‌కి తరలించారు. పిల్లలు ముగ్గురికి విరేచనాలు, వాంతులు అవుతుండటంతో ఆసుపత్రి లోనే చికిత్స పొందుతున్నారని ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు వైద్యులు. ఆదివారం ఎవరో పులి హోర ఇవ్వగా వాటిని ఉదయం తినడంతో వాంతులు, విరేచనాలు అయినట్లుగా బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు.

చికిత్స పొందుతున్న బాధితులు..

అయితే ఇదంతా కేవలం కలుషిత ఆహారం కారణంగా వాంతులు, విరోచనాలు, జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారా లేక కలుషిత నీరు తాగడం వల్ల జరిగిందా అనే విషయం తెలియదని బాధితులు వాపోతున్నారు. అయితే మొత్తం 70 మంది వరకు అస్వస్థతకు గురైనట్లుగా కాలనీలోని బాధితులు చెబుతున్నారు. కొందరు ఇంటి దగ్గర చికిత్స పొందుతుంటే మరికొందరు ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుడగజంగాల కాలనీలో బాధితులు తాగిన నీరు, ఆహార పదార్ధాల శాంపిల్స్ సేకరించారు. పరీక్షలకు పంపినట్లుగా తెలుస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *