Flower Market: ఏ సీజన్‌లో అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు.. ఎక్కడో వీడియో చూడండి | బిజినెస్


Last Updated:

Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురంలోని హోల్‌సేల్ పూల మార్కెట్‌ కి రావాల్సిందే.

Rapid Read
+

ఏ

ఏ సీజన్ అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు

Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురంలోని హోల్‌సేల్ పూల మార్కెట్‌ కి రావాల్సిందే. తెల్లవారుజాము నుండి రంగు రంగుల పూలతో బిజీ గా కనిపిస్తుంది. ఈ మార్కెట్ ద్వారా 5,000 కంటే ఎక్కువ కుటుంబాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జీవనోపాధి పొందుతారు. ఏ సీజన్లో అయినా ఎక్కడ తక్కువ దారితే పూలు అందుబాటులో ఉంటాయని స్థానిక వ్యాపారి ఈశ్వరరావు అంటున్నారు. కర్నూలు, రాజమండ్రి, బెంగళూరు వంటి ప్రాంతాల నుండి ప్రతిరోజూ ఈ మార్కెట్ కి తెల్లవారుజామున ట్రక్కులలో పూలు వస్తాయని అంటున్నారు. వీటితోపాటు స్థానికంగా పండించిన రైతులు కూడా ఇక్కడ అమ్మకాలు చేస్తారని అంటున్నారు. బహిరంగ మార్కెట్ తో పోలిస్తే 50 శాతం కంటే తక్కువ ధరలు ఉంటాయని అంటున్నారు.

పూల సంత..

మార్కెట్ తో పాటు ఆనందపురం జంక్షన్ ఫ్లై-ఓవర్ కింద రోడ్డు పక్కన చిన్న పూల వ్యాపారులు కూర్చొని అమ్మకాలు చేస్తారు. ఈ మార్కెట్ కి విశాఖపట్నం , విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వ్యాపారులు వచ్చి ఎక్కడ అధికంగా కొనుగోలు చేసుకుని వెళ్తారని అంటున్నారు. సంవత్సరం అంతా తాజాపూలతో మార్కెట్ అంతా కలకలాడుతుంది.

ఏ పూలైనా ఇక్కడ చీపే..

స్టార్ గులాబీ కేజీ 150 , క్రీమ్ గులాబి 180 , వైట్ గులాభి 180 , చామంతి 200 , ఇక్కడ కనకాంబరాలు , మల్లెపూలు ఇలా ఈ మార్కెట్లో తక్కువ ధరకే పూలు అందుబాటులో ఉంటాయని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో డబల్ రేట్లు ఉంటాయని అంటున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే ఆనందపురం మార్కెట్ కి వస్తే తక్కువ ధరకే ఇస్తామని అంటున్నారు. విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్లే దారిలో ఈ ఆనందపురం పూల మార్కెట్ ఉంటుంది.

పూలకు ఇదే సరైన మార్కెట్..

వేదిక ఏదైనా పూలు కోసం ఇతర ప్రాంతాలను సైతం వచ్చాక కొనుగోలు చేసుకుంటారు. భారీగా పూలు కావాలనుకుంటే ఈ మార్కెట్ కి వస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *