Last Updated:
AP News: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలో ఈ సంఘటన జరిగింది.
Horsley Hills Forest Fire: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కొండ దిగువన ఉన్న సెరికల్చర్ ఫాం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారని తెలిపారు. దీంతో నాయనిబావి, గట్టు, సూరపువారి పల్లె అటవీ ప్రాంతాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
హార్సిలీహిల్స్లోని ఉన్న గుట్టల్లో మంటలు ప్రారంభమై క్రమంగా గట్టుకొండ, గుర్రపుగుట్టలు, ముక్కొండ వరకు ఈ మంటలు విస్తరించాయి. ఎండిన ఆకులు, గడ్డి, బోద అధికంగా ఉండటంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. రాత్రి వరకు 600 ఎకరాలకు పైగా ఉన్న అడవి ప్రాంతం దగ్ధమైంది. మంటల ధాటికి తట్టుకోలేక జంతువులు పరుగులు తీశాయి. కొన్ని మంటల్లో కాలిపోయాయని తెలిపారు. సెరికల్చర్ ఫాం వద్ద మంటలు పూర్తి ఆర్పివేశామని అటవీశాఖ సెక్షన్ అధికారి శివకుమార్ వివరించారు. మిగిలిన చోట్ల అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



