Easter Celebrations: గోదావరి జిల్లాలో ఈస్టర్ వేడుకలు.. సమాధి తోటల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఏపీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా, కాకినాడ రాజమండ్రి గోదావరి జిల్లాల్లో క్రిస్టియన్స్ సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు

+

ఏపీలో

ఏపీలో సమాధుల పండుగ అసలు విషయం ఇదే

ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమూదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన యేసు జన్మించారంటూ ప్రత్యేకంగా పేర్కొంటున్నారు, దీంతో కాకినాడ, రాజమండ్రి, గోదావరి జిల్లాల అనేక ప్రాంతాల క్రైస్తవుల స్మశాన వాటికలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు, ఒకసారి ఆ విశేషాలు క్లుప్తంగా చూద్దాం

గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ నగరం సాంబమూర్తి నగర్లో గల క్రిస్టియన్స్ స్మశాన వాటికలో ఈస్టర్ పండుగ వేడుకలు కుటుంబాల సమేతంగా క్రిస్టియన్స్ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తుకు సంబంధించిన సంకీర్తనలు పాడుతూ, ఈ పండుగలో క్రిస్టియన్ పాల్గొన్నారు.

ఈ పండుగ ముఖ్య ఉద్దేశం పెద్దల స్మృతులు గుర్తు చేసుకుంటూ వారిని గౌరవించుకునే విధంగా ఈ పండుగ నిర్వహించుకుంటామని తెలిపారు, వారు సమాధిలో శాశ్వత నిద్రలో ఉంటారని ఇలాంటి తరుణంలో ఆ సమాధి వద్దకు వెళ్లి అందంగా సమాదులను అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఈ ఒక్క రోజుకు మాత్రమే చెల్లుతుందంటూ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట రాజానగరం ఇలా అనేక ప్రాంతాల్లో గల చర్చ్‌లు క్రిస్టియన్స్ కు సంబంధించిన సమాధి ప్రాంతాలకు పెద్ద ఎత్తున క్రిస్టియన్స్ అంత కుటుంబాల సమేతంగా చేరుకున్నారు. చిన్నారులు పెద్దలు సైతం స్మశాన వాటికకు చేరుకుని వారి పెద్దల గోలీల వద్ద అనేక రకాల పువ్వులతో అందంగా అలంకరించి, దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రతిఒక్కరు శాంతిగా ఉండాలని ప్రభువు ఎప్పుడూ కోరుకుంటారంటూ క్రిస్టియన్స్ మత పెద్దలు ప్రత్యేకంగా తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా ప్రభువు సంకీర్తనలతో పాటు తెల్లని వస్త్రాలు ధరించిన ప్రత్యేక ర్యాలీలు సైతం కాకినాడ కేంద్రంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు

మరోపక్క ఆదివారం కావడంతో, గోదావరి జిల్లాలో ఉన్న చర్చలన్నీ భక్తుల రాకతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి, సాధారణ ఆదివారాలకు మించి ఈస్టర్ ఆదివారం అధిక సంఖ్యలో క్రిస్టియన్ సంత చర్చలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు పండుగ నేపథ్యంలో చిట్టి పొట్టి చిన్నారుల అలంకరణలు సైతం ఈ ఏడాది ఈస్టర్ పండుగలో ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు.

వీరితోపాటు క్రిస్టియన్స్ మహిళలు ప్రభువు యేసు నామానికి సంబంధించిన పాడిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఏది ఏమైనా ఏపీవ్యాప్తంగా ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *