ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మార్చి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఉగాది పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు:
* ఉచిత ప్రయాణం: 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
* వర్తించే బస్సులు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఎక్కడికైనా ఉచితంగా వెళ్లవచ్చు. వీరికి ‘జీరో టికెట్’ జారీ చేస్తారు.
* సహాయకులకు రాయితీ: దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు (Escorts) టికెట్ ధరలో 50 శాతం రాయితీ లభిస్తుంది.
* విస్తరణ: గతంలో కేవలం 4 వర్గాలకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు 21 రకాల వైకల్యాలు ఉన్నవారికి విస్తరించారు. దీనివల్ల రాష్ట్రంలోని సుమారు 11.16 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.
* పాస్ వివరాలు: ఇప్పటికే ఉన్న రాయితీ పాస్లు చెల్లుబాటు అవుతాయి. కొత్తగా పొందాలనుకునే వారు ‘సదరం’ (SADAREM) సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో ఆన్లైన్ లేదా బస్ పాస్ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతర లగ్జరీ బస్సులైన సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో గతంలో ఉన్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుంది.

ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 18 రోజులు పూర్తయ్యాయి. ఇవాళ 19వ రోజు కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ నేడు 3వ రోజు జరుగుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చిస్తారు. నేటి మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఏపీ మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన నేటి నుంచి ప్రారంభమవుతోంది. నేడు విజయవాడకు వైఎస్ జగన్ వస్తున్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.