Last Updated:
Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు.
Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు. ఏపీలో మార్చి 18 నుండి అంటే ఈరోజు బుధవారం నుండి ఆర్టీసీ బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణం ప్రారంభం అవుతుందని తెలిపారు. పథకం పేరు దివ్యాంగ శక్తి గా నామకరణం చేయడం జరిగింది అని తెలిపారు.
పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సహా 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ చెయ్యవచ్చు అని తెలిపారు.. 50శాతం రాయితీ మాత్రమే ఉన్న దివ్యాంగులకు ఇప్పుడు స్త్రీ శక్తి పథకం తరహాలో పూర్తి సబ్సిడీ అందించనున్నారు. మరి దివ్యాంగుల సాధికారతకు పెద్దపీట వేస్తూ, వారి సామాజిక, ఆర్థిక పురోగతికి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయించింది. దివ్యాంగ శక్తి పథకం కింద అర్హులైన దివ్యాంగులు అందరికీ ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పిస్తారు. అయితే ప్రయాణ సమయంలో దివ్యాంగులు తమ వెంట గుర్తింపు కార్డులు అంటే సదరం సర్టిఫికెట్ లేదా ఆర్టీసీ పాస్ ఇతర సంబంధింత ధ్రువపత్రాలు ఉంచుకోవాలి. వీరికి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు.
ప్రతి ఒక్క దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తెలిపారు. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే విశాఖపట్నంలోని ప్రధాన కార్యాలయం కు వస్తే వివరించడం జరుగుతుందని తెలిపారు. తమకు సంబంధించిన కార్డులు ఇచ్చేందుకు బస్సు పాస్ కౌంటర్లో సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్యాంగులు ఆర్టీసీ బస్ వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరికి వారికి ప్రత్యేక సీట్లు కేటాయించామని ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ తెలిపారు. బస్సుకు ముందు భాగంలో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించమని అన్నారు. ఇదివరకు కొంత సౌకర్యంగా ఉన్నాయి సీట్లు మెరుగుపరిచామని తెలిపారు. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


