నేతలు దివ్యాంగులతో బస్సులో ఎందుకు ప్రయాణించారు?: మంగళగిరి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లతో కలిసి బస్సెక్కి 11 కి.మీ. ప్రయాణించారు. బస్సులోనే దివ్యాంగులతో మాట్లాడి, “ప్రజా ప్రభుత్వం వచ్చాక మీ బాగోగులు మారాయా?” అని అడిగారు.



