Digi Rythu Bazaar: ఇంటికే రైతు బజార్ కూరగాయలు.. స్టీల్ సిటీలో డిజి యాప్ సేవలు విస్తృతం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Visakhapatnam: విశాఖపట్నంలో ప్రతి రోజు రైతు బజార్లో తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే, యాప్ టాప్ చేస్తే చాలు ఇంటికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

+

ఇలా

ఇలా “యాప్ ని కొడితే…  అలా వచ్చేస్తాయి కూరగాయలు..! ఏపీలో “డిజి యాప్” “digiRB” ద

Digi Rythu Bazaar: ప్రపంచంలోను అటు దేశంలోనూ మనిషికి కావాల్సింది ఆహారం. ప్రతిరోజు ఆహారం లేనిదే ఏ మనిషి బతకలేడు. ఆహారం అంటే కావాల్సింది ఆహార ధాన్యాలు.. కూరగాయలు. కూరగాయల విషయంలో ఎప్పుడు ఏ మనిషి కాంప్రమైజ్ అవ్వడు. కూరగాయలు ఎక్కడో రైతు బజార్ నుంచో మార్కెట్ల తెచ్చుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. తమ ఇంట్లో నిత్యం ఏదో ఒక కూరగాయలు ఉండాల్సిందే. ప్రతి ఒక్క కుటుంబానికి కూరగాయలు లేకుండా ఏ కుటుంబం నడవదు. అంటే కుటుంబానికి కావాల్సింది కూరగాయలు.. ఇంకా ఇతర వస్తువులు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక యాప్ ని ప్రత్యేకించి తీసుకువచ్చింది. ఆ “యాప్” లోకి వెళ్తే చాలు కూరగాయలు ఇంటికే వస్తాయి. రైతు బజార్లో ఎక్కడైతే ధరలు అనుకూలంగా ఉన్నాయో సానుకూలంగా ఉన్నాయో.. ఆ ధర ప్రకారం ఇంటికి వస్తాయి. ఆ కూరగాయలకి ప్రత్యేకించిన సదుపాయాన్ని విశాఖపట్నంలో అది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కల్పించింది ఏపి ప్రభుత్వం.! ఆన్లైన్ హోం డెలివరీ రావడంతో ప్రజలు ఇంటి వద్ద నుండే ఆర్థర్ చేసుకొని ప్రతి వస్తువు కొనుగోలు చేసుకుంటున్నారు. బయటకి వెళ్ళి తీసుకువచ్చే అని లేకుండా ఉండడంతో అధిక శాతం ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

విశాఖలో డీజీ రైతుబజార్..

విశాఖపట్నంలో ప్రతి రోజు రైతు బజార్లో తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే, యాప్ టాప్ చేస్తే చాలు ఇంటికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులు తీసుకువచ్చే తాజా కూరగాయలు హోం డీలివరీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా విశాఖ ఎంవిపి రైతు బజార్ లో ఫైలెట్ ప్రాజెక్టుగా డిజి రైతు బజార్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. ఈ డిజి రైతు బజార్ ద్వారా ప్రైవేట్ యాప్ లుకి దీటుగా హోం డెలివరీ అందిస్తారు. పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ అవడంతో నరసింహనగర్ ,  మర్రిపాలెం గోపాలపట్నం ,మధురవాడ , గాజువాక ఇలా అన్ని రైతు బజార్లో హోమ్ డెలివరీ ప్రారంభించారు. ఎంవిపి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు తెలిపారు.

ఇంటికే కూరగాయలు..

ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూరగాయల్ని ఈ యాప్ ద్వారా అందుకోవచ్చని ఆయన వివరించారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ యాప్ పనిచేస్తుందని ఈ యాప్ ద్వారా ఎక్కడైతే ఆర్డర్ వస్తుందో.. ఆ ఆర్డర్ ప్రకారం కూరగాయలు ఇంటికి వచ్చేస్తాయని ఆయన వివరించారు. మొత్తం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని న్యూ 18 సైట్ ద్వారా ఆయన వివరించారు. అసలు డిజీ యాప్ ద్వారా వచ్చే కూరగాయలు ఎలా వస్తాయి? ఎలా పంపిస్తాం అనే విషయాన్ని ఆయన చాలా కూలంకషంగా వివరించారు.

ఒక్క కాల్ చేస్తే చాలు..

రైతు బజార్ లో ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:30 గంటల మధ్య 9391609586 నంబర్కు కాల్ చేసి.. కూరగాయలు, పూలు, పూజా సామాగ్రిని ఇంటికే తెప్పించుకోవచ్చు. కనీసం ₹100 ఆర్డర్పై 5 కి.మీ పరిధిలో డెలివరీ ఉంటుంది. వారం మొత్తం అన్ని రైతు బజార్లు తెరిచే ఉంటాయని ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు తెలిపారు. యాప్ లో ఆర్డర్ చేస్తే  రైతు బజార్ లో రైతులు తీసుకువచ్చిన తాజా కూరగాయలు ఇంటి వద్దకే తీసుకువస్థారు. విశాఖపట్నం ఎంవిపి రైతు బజార్ లో డిజి రైతు బజార్ ద్వారా హోం డెలివరీ ప్రారంభించినట్లు తెలిపారు. రైతు బజార్ ద్వారా వెబ్సైట్లో, యాప్ లో ఆర్డర్ చేసుకుంటే రైతు బజార్ ధరకే అన్ని రకాల కూరగాయలు ఇంటికే డెలివరీ అవుతాయని తెలిపారు. రైతు బజార్ నుండి 5 కిలోమీటర్ల పరిధిలో ఫ్రీ డెలివరీ అవుతుందని అన్నారు. ఇకపై ఎవరికైనా రైతు బజార్ కూరగాయలు ఆన్లైన్లో కావాలనుకుంటే బుక్ చేసుకోవాలని అన్నారు. digirythubazaarap.com, “digiRB” యాప్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్క రైతు బజార్ లో మాత్రమే ఏర్పాటు చేసారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *