Last Updated:
Death Mystery: 13 ఏళ్ల బాలుడు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. అతడ్ని వెదుక్కుంటూ వెళితే రక్తపు మడుగులో మృతదేహం కనిపించింది. శరీరంపై బుల్లెట్ గాయం కూడా ఉంది.
Death Mystery: ఆ జిల్లాలో విషాదాలు అలముకున్నాయి. అభం శుభం తెలియని స్కూల్ విద్యార్థి గ్రామశివారు చనిపోయి కనిపించాడు, రక్తపు మడుగుల్లో బాలుడు మృతదేహం ఆప్రాంతంలో కనిపించడంతో అసలు ఏమైందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాతకక్షాల ఇంట్లో సమస్యల అంటే పెద్దవాడుకాదు స్కూల్ కి వెళ్లే అతి చిన్నవాడు, గ్రామంలో బాలుడికి జరిగిన అన్యాయంపై పలువురు రకరకాలుగా గుసగుసలాడుతున్నారు.అయితే ఆడుకునేందుకు బాలుడు ఆగ్రామ శివారు పోలవరం కాలువ వద్దకు వెళ్లాడని, అలాంటి తరునంలో అనుకోకుండా నాటు తుపాకీ పేళీ తగిలి ఉండవచ్చు అంటూ కొందరు చెబుతున్నారు? ఏది ఏమైనా బాలుడు స్వగ్రామంతో పాటు జరిగిన ప్రాంతంలో సైతం విషాదఛాయలు అలుముకున్నాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఎటికొప్పాక గ్రామశివారు 13 ఏళ్ల బాలుడు రక్తపుమడుగులో అనుమానస్పదంగా మృత్యువాత పడ్డాడు.అసలేం జరిగింది..?
ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఎటికొప్పాక గ్రామశివారు 13 ఏళ్ల బాలుడు రక్తపుమడుగులో అనుమానస్పదంగా మృత్యువాత పడ్డాడు. దీంతో ఇదిచూసిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 13 ఏళ్ల బాలుడు, అభం శుభం తెలియని చిన్నారిని ఎవరు పోట్టన పెట్టుకున్నారు అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఘటన ప్రాంతానికి ఎలమంచిలి రూరల్ పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకున్నారు, జరిగిన ఘటనపై ఆరాధిస్తున్నారు. అయితే గ్రామ శివారు ఈ ఘటన జరగడంతో బహుశా ఏ నాటు తుపాకీ గుర్తుతెలియని వ్యక్తులు పేల్చినప్పుడు దురదృష్ట సాతు బాలుడికి తగిలి చనిపోయి ఉండవచ్చు అంటూ పలువురు గుసగుసలాడుతున్నారు. మరపక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అధికారంగా పోలీసులు ఏం జరిగింది అన్నది మరో 24 గంటల్లో తెలుపుతారని సమాచారం అందుతుంది.
కాకినాడజిల్లా తుని పట్టణానికి చెందిన కౌశిక్ తండ్రి ఇటీవల చనిపోవడంతో మేనమామ ఇంట్లో ఉంటూ ఏటికొప్పాక ప్రాంతంలో చదువుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో ఏం జరిగిందో ఏమో గాని బాలుడు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. ఇటీవల తండ్రి, ఇప్పుడు కొడుకు ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు అయితే బాలుడు మృతి పై అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,బాలుడుతో ఉండే స్నేహితులను సైతం పలు విషయాలు పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు అదే విధంగా స్కూల్ కి ఎప్పుడు వెళ్ళాడు, ఎటికొప్పాక పోలవరం కాలువ సమీపంలోకి ఎవరెవరు వచ్చారు, ఇలా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏది ఏమైనా ఏం జరిగిందో ఏమో గాని చదువుకునే విద్యార్థి ప్రాణం పోవడంతో ఇటు కాకినాడ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో సైతం విషాదశాలలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


