Crime News: దారుణం.. 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు డ్రైవర్లు లైంగిక దాడి.. రాష్ట్రంలో మరో సంచలన కేసు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఈ ఘటనలో నిందితులు బాలికను ఒంటరిగా చూసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తరచూ వేధింపులు కొనసాగడంతో ఆమె గర్భవతి అయింది. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా….

News18
News18

కర్నూలు జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. రోజూ పాఠశాలకు వెళ్లే 14 ఏళ్ల విద్యార్థినిని తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ఆమెపై కోరికను పెంచుకుని, తరువాత తన స్నేహితుడితో కలిసి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బెదిరింపులతో బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయింది.

ఈ ఘటనలో నిందితులు బాలికను ఒంటరిగా చూసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తరచూ వేధింపులు కొనసాగడంతో ఆమె గర్భవతి అయింది. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరీక్షల్లో గర్భం దాల్చిన విషయం బయటపడింది. అనంతరం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ పరిణామంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి: రేపటి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

పోలీసుల విచారణలో బాధితురాలు ఎదుర్కొన్న బాధ బయటపడింది. ఆటోడ్రైవర్‌తో పాటు అతని స్నేహితుడు కూడా బెదిరింపులతో అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆమె తెలిపింది. విషయం బయటపెడితే ప్రాణహాని కలుగుతుందని భయపెట్టడంతోనే ఇంతకాలం మౌనం పాటించినట్లు చెప్పింది. ఈ కేసులో నిందితులు బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం.

ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారుల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *