Commissioner Controversy: కింది స్థాయి ఉద్యోగులపై బూతుల వర్షం.. పిఠాపురం కమీషనర్ ఆడియో వైరల్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఫోన్‌లో సానిటరీ ఇన్స్పెక్టర్‌ను తిట్టిన ఆడియో వైరల్, ఉద్యోగుల ఆందోళన, కమిషనర్ సస్పెన్షన్ డిమాండ్

+

పిఠాపురం

పిఠాపురం మున్సిపల్ కమిషనర్ తిట్లు దండకం వింటే చెవులు మూసుకోవాల్సిందే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలో కమిషనర్ మాటలు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన ఆడియో వైరల్ అయిన పరిస్థితి నెలకొంది. ఆయన కింద స్థాయి ఉద్యోగిని ఫోన్లో తిట్టిన తిట్ల దండకం వింటే చెవులు మూసుకోవాలి అనే విధంగా ఆయన తిట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సానిటరీ ఇన్స్పెక్టర్‌కు మద్దతుగా అనేకమంది ఉద్యోగులు పిఠాపురం మున్సిపాలిటీకి చేరుకుని, ఉన్నత స్థాయి అధికారులకు కమిషనర్ పై ఫిర్యాదు అందించారు. ఇంతకీ పిఠాపురం మున్సిపాలిటీలో ఏం జరిగింది? ఎందుకు కింద స్థాయి ఉద్యోగిని కమిషనర్ తిట్లు దండకంతో ఇబ్బందులు పెట్టారు? ఒకసారి చూద్దాం

కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌గా కనకారావు పనిచేస్తున్నారు. ఆయన కింద అనేక శాఖల ఉద్యోగులు అన్ని మున్సిపాలిటీలో లాగానే ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పారిశుద్ధ్యానికి సంబంధించి సానిటరీ ఇన్స్పెక్టర్‌ ప్రధానమని చెప్పుకోవచ్చు. పిఠాపురానికి సంబంధించి ఒక నివాసం సమీపంలో ఎక్కువగా చెత్త ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో బాధితుడు మున్సిపల్ కమిషనర్ను ఆశ్రయించాడు, అయితే అంతకు ముందు ఏదైనా విషయంలో విసుగుపోయారో మరి ఏమోగానీ, మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి బాధితులు నేరుగా సానిటరీ ఇన్స్పెక్టర్‌కు ఫోన్ అందించారు అంతే కమిషనర్ ఆ సానిటరీ ఇన్స్పెక్టర్లను తిట్ల వర్షం కురిపించారు.

మీకు ఏం కావాలి సానిటరీ ఇన్స్పెక్టర్ గారు అని మాట్లాడుతూ నోటికి వచ్చిన తిట్లని తిడుతూ సానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు సానిటరీ ఇన్స్పెక్టర్‌కు మద్దతుగా నిలిచారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అ పదజాలాలతో దూషించిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలి అంటూ ఉన్నత అధికారులకు ప్రత్యేక వినతిపత్రం అందించారు. ఉద్యోగి అంటే చులకనగా ఉందా మీ ఇష్టారాజ్యంగా తిడతారా అంటూ వారు ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించారు, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదంటూ ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు.

ఉద్యోగులు మరోపక్క ఉన్నత అధికారులు సైతం ఈ విషయంలో కలగజేసుకున్నారు, ఉద్యోగులు అంటే అంకిత భావంతో కలిసిమెలిసి చేసుకోవాలని, అహంకారానికి వెళ్లకుండా పనులు చేసుకుంటేనే మనమంతా ముందుకు వెళ్లగలం అన్న విధంగా అధికారులు పేర్కొన్నట్టు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా మున్సిపల్ కమిషనర్ విషయం న్యాయం చేయాలంటూ పలువురు కోరుతున్నారు .

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *