CM Chandrababu: ప్రధానిగా మోదీ ఉండటం ఓ అద్భుతమైన వరం.. చంద్రబాబు సంచలన ట్వీట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు.

chandrababu
chandrababu

CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు.

“అనేక దేశాలు ఇంధన ధరల భారం ప్రజలపై మోపుతున్న సమయంలో, భారత్ మాత్రం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటోంది. ఇది ఎన్డీయే ప్రభుత్వ ప్రజాకేంద్రిత విధానానికి నిదర్శనం” అని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

మొక్కజొన్న రైతులకు అండగా ఉంటాం:

రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర (MSP) కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. మార్కెట్‌లో సరైన మద్దతు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని, ఈ అంశంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలో ధరలు పడిపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. మంత్రి ఇచ్చిన సమాచారంపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు, రైతుల ప్రయోజనాల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ కేంద్రానికి లేఖ పంపించారు.

ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం: లోకేశ్‌

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలపై అదనపు భారం పడకుండా తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైందని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *