త్వరలోనే నెల్లూరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప పట్టణాల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా రోజుకు సుమారు 7000 టన్నుల చెత్తను విద్యుత్తుగా మారుస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం మంత్రి శెట్టిపల్లి భూములను కూడా పరిశీలించారు.



