Chicken Rates Hike: మటన్‌ ధరతో నాటు కోడి పోటీ.. చికెన్ తిందామంటే కల్తీ భయం | బిజినెస్


Last Updated:

Chicken Rates: చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు చికెన్ ధరలు కూడా పోటీ పడుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు రుచి చూడాలంటేనే జంకుతున్నారు.

+

Chicken

Chicken Rates

వేసవి సీజన్‌లో మండిపోతున్న నాటుకోడి ధరలు

పెరిగిన కోళ్ల దానా ధరలతో తగ్గిన కోళ్ల పెంపకం

చికెన్ కల్తీకి పాల్పడుతున్న వ్యాపారస్తులు

పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు

మటన్ రేటు పలుకుతున్న నాటికోడి

చిత్తూరు జిల్లాలో కొండెక్కిన కోడి..!

Chicken Rates: చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు చికెన్ ధరలు కూడా పోటీ పడుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు రుచి చూడాలంటేనే జంకుతున్నారు. వారం పది రోజుల క్రితం వరకు కేజీ చికెన్ ధర రూ.200 నుంచి 250 మధ్య ఉండేది. కాని ఇప్పుడు కిలో కోడిమాంసం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు సండే రోజు కూడా కొనుక్కునేందుకు వెనక్కి తగ్గుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.400కు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి.

మటన్‌తో నాటు కోడి పోటీ..

ఇక నాటు కోడి ధరల విషయానికి వస్తే తినాలంటే కాదు కనీసం వాటి వైపు చూడాలంటే కూడా రేట్లు భయపెడుతున్నాయి. కిలో నాటి కోడి ధర రూ.700 నుంచి రూ.900 వరకు చేరుకోవడంతో మాంసప్రియులు నాటు కోడి కూడా గట్టిగానే కూస్తోంది కదా అని జోకులు వేసుకుంటున్నారు. మటన్ ధరతో పోటీ పడుతోందని కొనడమే మానేస్తున్నారు. కోళ్ల దానా ధరలు వారిగా పెరగడంతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవి కారణంగా ఫారాలను కోడి పిల్లలు ఎక్కువగా చనిపోతున్నాయి. కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలో ఎండలు మండుతున్న వేళ ఎండలకు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది.

నాన్ వెజ్ లవర్స్‌కి షాక్..

అంతే కాదు కోళ్ల సరఫరా తగ్గడంతో ఇది అదునుగా వ్యాపారస్తులు చికెన్ కల్తీకి పాల్పడుతున్నారు. చనిపోయిన కోళ్లను కూ డా కట్ చేసి వినియోగదారులకు అమ్మేస్తున్నారు. రెండు మూడు రోజులు నిర్వహించిన చికెన్ కూడా తాజా చికెన్ లో కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.380 నుండి 400 వరకు చేరగా, సాధారణ చికెన్ కూడా సామాన్యులకు అందనంత దూరంగా వెళ్లిపోయింది. ఈ ధరల పెరుగుదలతో హోటళ్లు, చిన్నచిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బిర్యానీ, చికెన్ ఫ్రై, పకోడీ వంటి వంటకాల ధరలను పెంచకపోతే నష్టాలు తప్పవని హోటల్ యజమానులు చెబుతున్నారు.

నీసు జోలికి పోవాలంటే దడ..

నీసు వాసన చూడనిదే నోట్లో ముద్ద దిగని వాళ్లు కూడా ఈ ధరలు చూసి, కల్తీ మాంసం మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిసి నోరు కట్టేసుకుంటున్నారు. కొన్నిచోట్ల అయితే గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు తాత్కాలికంగా మూతపడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం వేసవి తీవ్రతేనని పౌల్ట్రీ యజ మానులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కోళ్లు బతికేలా ఉంచడానికి ఫారాల్లో కూలర్లు, ప్రత్యేక ఆహారం వంటి అదనపు ఖర్చులు పెరిగాయి.

ఇంధనం ధరలు పెరగడమే..

ఇంధనం ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమయ్యాయి. కోళ్ల దాణా ధరలు కూడా పెరగడంతో వ్యాపారులకు భారంగా మారింది. ఈ భారమంతా చివరకు వినియోగదారుడిపైనే పడుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో వంట ఖర్చులు పెరి గిన నేపథ్యంలో చికెన్ కొనుగోలు చేయడం సామాన్య కుటుంబాలకు భారంగా మారింది. కొన్నిచోట్ల చికెన్ పకోడీ వంటి స్నాక్స్ కూడా భారీ ధరలకు అమ్ముతున్నారు. ఒక కుటుంబం సాధారణంగా చికెన్ కొనుగోలు చేసి వండుకోవాలంటే కనీసం రూ.500 ఖర్చవుతున్న పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో కొను గోలు చేసి హోటళ్లు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆ అదనపు ఖర్చును కస్టమర్లపైనే మోపుతూ టిఫిన్, మీల్స్, ఇతర ఆహార పదార్థాలపై అదనపు ఛార్జీలు వేస్తున్నారు. మరోవైపు కల్తీ, నాణ్యత లేని మాంసం అమ్మకాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆహార భద్రత అధికారులు సూచిస్తున్నారు.

గుడ్ల ధర ఢమాల్..

ఇదిలా ఉండగా గుడ్ల మార్కెట్లో మాత్రం విరుద్ద పరిస్థితి కనిపిస్తోంది. చికెన్ ధరలు పెరుగుతుండగా గుడ్ల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఒక గుడ్డు రూ.4 చొప్పున లభిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో చికెన్ ఆకాశంలో గుడ్డు నేలమీద అనే పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలానికి చెందిన విజయ్ భాస్కర్ రెడ్డి రైతన్న కు 30 ఎకరాలు పొలం ఉన్నది. అతని పొలంలో చిన్న షేడ్ ఏర్పాటు చేసి, నాటు కోళ్లు పెంచారు.పెట్టుబడి రూ.3 లక్షలు పెట్టారు.లాభం రూ.3.50 లక్షలు లాభం వచ్చింది. మంచి లాభాలు వరించాయిని హర్షం వ్యక్తం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *